HYD : దుమ్మురేపిన బిర్యానీ.. నిమిషానికి ఎన్ని ఆర్డర్లు అంటే..?

by Disha Web Desk 4 |
HYD : దుమ్మురేపిన బిర్యానీ.. నిమిషానికి ఎన్ని ఆర్డర్లు అంటే..?
X

దిశ, వెబ్‌డెస్క్: హైదరాబాద్ అంటే ఫస్ట్ గుర్తొచ్చేది బిర్యానీ. ఒకేషన్ ఏదైనా మెనూలో బిర్యానీ ఉండేలా ఫుడ్ లవర్స్ ప్లాన్ చేసుకుంటారు. అయితే న్యూఇయర్ వేళ బిర్యానీ సేల్స్ రికార్డుల మోత మోగించింది. జొమాటోలో 2015-2020 మధ్య ఎన్ని ఆర్డర్లు బుక్ అయ్యాయో.. అన్ని ఆర్డర్లు ఒక్క 2023 డిసెంబర్ 31న వచ్చినట్లు సంస్థ ప్రకటించింది. కొత్త ఏడాది సందర్భంగా హైదరాబాద్ లో ఏకంగా 4.8 లక్షల బిర్యానీ ప్యాకెట్లు డెలివరీ చేసినట్లు స్విగ్గీ తెలిపింది. ప్రతి నిమిషానికి 1,244 ఆర్డర్లు వచ్చాయని స్పష్టం చేసింది. కొత్త సంవత్సరం వేళ ప్రతి గంటకు 1,722 యూనిట్ల కండోమ్స్ ఆర్డర్లు వచ్చినట్లు స్విగ్గీ ఇన్ స్టా మార్ట్ తెలిపింది. ఓయో రూమ్స్ బుకింగ్ సైతం రికార్డు స్థాయిలో నమోదు అయ్యాయి. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది 37 శాతం అధికంగా 6.2 లక్షల బుకింగ్స్ జరిగాయి.



Next Story