- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HYD : మైనంపల్లి హన్మంతరావుపై అట్రాసిటీ కేసు
by Sathputhe Rajesh |
మల్కాజ్ గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత రావు పై అట్రాసిటీ కేసు నమోదైంది.

X
దిశ, వెబ్‌డెస్క్: మల్కాజ్‌గిరి కాంగ్రెస్ అభ్యర్థి మైనంపల్లి హన్మంత రావుపై అట్రాసిటీ కేసు నమోదైంది. గురువారం జరిగిన పోలింగ్ సందర్భంగా హైదరాబాద్ యాప్రాల్‌లోని బూత్ వద్ద మైనంపల్లి తన అనుచరులతో కలిసి తనపై దాడి చేశారని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కరంచంద్ ఆరోపించారు. పోలింగ్ ఓ వైపు జరుగుతుండగానే మైనంపల్లి తన అనుచరులతో కలిసి నంబర్ ప్లేట్లు లేని కార్లలో వచ్చారని.. కర్రలతో తమపై దాడి చేశారన్నారు. ఇక, ఈ ఘటనపై శుక్రవారం జవహర్ నగర్‌లోని పోలీసు స్టేషన్‌లో మైనంపల్లితో పాటు ఆయన అనుచరులపై కేసు నమోదు చేశారు. కాగా, మల్కాజిగిరిలో మైనంపల్లి బరిలో నిలవగా ఆయన కుమారుడు రోహిత్ మెదక్ స్థానం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు.
Next Story






