HYD : నగరవాసులకు బంపర్ ఆఫర్.. అలా చేసి మెట్రోలో మూడు రోజులు ఉచితంగా ప్రయాణించండి

by Disha Web Desk 1 |
HYD : నగరవాసులకు బంపర్ ఆఫర్.. అలా చేసి మెట్రోలో మూడు రోజులు ఉచితంగా ప్రయాణించండి
X

దిశ, వెబ్‌డెస్క్ : నగర వాసులకు హైదరాబాద్ మెట్రో రైలు అధికారులు సువర్ణాకాశం కల్పించింది. సంక్రాంతి పండుగ సందర్భంగా పట్టణవాసులు పల్లెలకు పయనయ్యారు. దీంతో నగరం అంతా నిర్మానుష్యంగా మారింది. దీంతో మెట్రో రైలు ప్రయాణికులు లేక వెలవెలబోతోంది. ఈ క్రమంలోనే అధికారులు హైదరాబాద్ మెట్రోలో నేటి నుంచి మూడు రోజుల అపరిమిత ఆఫర్ అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎవరైతే మెట్రో కార్డ్ కలిగి ఉన్నారో వారు రూ.59 రీఛార్జ్ చేయడం వల్ల ఈ అవకాశాన్ని వినయోగించుకోవచ్చు. జనవరి 13, 14, 15 తేదీల్లో మెట్రో హాలిడే కార్డు వర్తిస్తుందని, ఒక్క సారి రీఛార్జ్ చేసుకుంటే ఆ రోజంతా రైలులో ఉచితంగా ఎక్కడి నుంచి ఎక్కడికైనా.. ప్రయాణించవచ్చని అధికారులు తెలిపారు.

Next Story

Most Viewed