Drinking Wives: జంబలకిడిపంబ! మా భార్యలు తెగ తాగేస్తున్నారు.. భర్తల ఫిర్యాదు

by Ramesh Naini |   (  Updated:2025-03-13 07:42:40  IST  )

భర్త తాగొచ్చి రోజూ గొడవ చేస్తున్నాడనో, కొడుతున్నాడనో భార్య పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం వెరీ కామన్..

Drinking Wives: జంబలకిడిపంబ! మా భార్యలు తెగ తాగేస్తున్నారు.. భర్తల ఫిర్యాదు
X

దిశ, డైనమిక్ బ్యూరో : భర్త తాగొచ్చి రోజూ గొడవ చేస్తున్నాడనో, కొడుతున్నాడనో భార్య పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టడం వెరీ కామన్.. ఇలాంటి ఘటనలు రోజూ ఏదో ఒకచోట జరుగుతూనే ఉంటాయి. కానీ మా భార్యలు మందుకు బానిసలయ్యారంటూ భర్తలే పోలీసులకు ఫిర్యాదు చేస్తే.. నమ్మట్లేదా..?.. నిజమేనండి బాబు.. ఒడిశా రాష్ట్రం కొరాపుట్ జిల్లా పూజారిపుట్ పంచాయతీలోని కొండగూడ గ్రామంలో తమ భార్యలు మద్యానికి బానిసలు అయ్యారంటూ భర్తలు పోలీసులకు, ఆబ్కారీ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాము కష్టపడి కూలి చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటే, ఆ డబ్బులతో మందు తాగుతున్నారని.. గ్రామంలో నాటుసారా విపరీతంగా తయారు చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.

Next Story