- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డాక్టర్ లవ్ ఎఫైర్..? లేడీ డాక్టర్ ఆత్మహత్య! ప్రియురాలు ఎంట్రీతోనేనా..?
సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వైద్య దంపతులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు.

దిశ, వెబ్‌డెస్క్ : సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిన వైద్య దంపతులు షాకింగ్ నిర్ణయం తీసుకున్నారు. వారి కాపురంలోకి మరో వ్యక్తి ఎంట్రీ ఇవ్వడంతో.. పచ్చని కాపురంలో కలహాలు రేగాయి. భర్త ఇన్ స్టాగ్రామ్ లో రీల్స్ చేసే అమ్మాయితో ప్రేమలో పడ్డాడని అనుమానించి భార్య.. ఆత్మహత్యతో తనువు చాలించింది. ఈ దారుణం హనుమకొండ జిల్లా హసన్ పర్తిలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అల్లాడి సృజన్ - ప్రత్యూషలు వృత్తిరీత్యా డాక్టర్లు. కొన్నాళ్లు బాగానే సాగిన వీరి కాపురంలో భర్త ప్రేమాయణం చిచ్చు రేపింది. సృజన్ కార్డియాలజిస్ట్ గా పనిచేస్తుండగా.. ప్రత్యూష డెంటిస్ట్. కొన్నాళ్ల క్రితం డాక్టర్ సృజన్ ను సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇంటర్వ్యూ చేసింది. ఆ వీడియోలను రీల్స్ గా ప్రమోట్ చేయడంతో ఇద్దరి మధ్య పరిచయం స్నేహంగా ఆపై ప్రేమగా మారింది. విషయం ప్రత్యూషకు తెలియడంతో నిలదీసింది. పలుమార్లు ఇద్దరి మధ్య గొడవలు కూడా జరిగినట్లు ప్రత్యూష తల్లిదండ్రులు పోలీసులకు తెలిపారు. భార్యగా తానుండగా.. మరో యువతిని భర్త ప్రేమించడాన్ని భరించలేకపోయిన ప్రత్యూష ఆత్మహత్య చేసుకుందని పేర్కొన్నారు. తమ కూతురి చావుకి కారణమైన అల్లుడిని, ఆ యువతిని శిక్షించాలని ప్రత్యూష తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై హసన్ పర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.






