- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరికి ఇల్లును అమ్మేసిన భర్త
భార్య పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరకి భర్త ఏకంగా ఇల్లునే అమ్మేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలోని శాంతినగర్‌లో నికితా, శ్రావణ్ దంపతులు నివాసం ఉంటున్నారు.

దిశ, వెబ్ డెస్క్: భార్య పుట్టింటికి కాన్పుకు వెళ్లి వచ్చేసరకి భర్త ఏకంగా ఇల్లునే అమ్మేశాడు. ఈ ఘటన హైదరాబాద్‌లో చోటు చేసుకుంది. కూకట్‌పల్లిలోని శాంతినగర్‌లో నికితా, శ్రావణ్ దంపతులు నివాసం ఉంటున్నారు. ఇద్దరి మధ్య తరచూ గొడవలు జరగటంతో డెలివరీ కోసం పుట్టింటికి వెళ్లిన నికిత తల్లిగారి ఇంటివద్దనే ఉండిపోయింది. కాగా బిడ్డపుట్టిన తరవాత కొన్ని నెలలకు తిరిగి హైదరాబాద్ రాగా తమ ఇంట్లో వేరేవాళ్లు ఉండటం చూసి షాక్ అయ్యింది.
మీరెవరని ప్రశ్నించగా వాళ్లు తాము ఇంటిని కొనుగోలు చేసినట్టు తెలిపారు. దీంతో భర్తకు ఫోన్ చేసినా స్పందించకపోవడంతో పోలీసులను ఆశ్రయించింది. పుట్టింటికి వెళ్లి వచ్చేసరికి ఇంటిని భర్త అమ్మేశాడని గ్రహించి ఇంటి ముందే తన కూతురుతో బైటాయించింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న నికిత తాను వెళ్లిపోయినా ఇంటికి మాత్రం ప్రతినెల ఈఎంఐలు కడుతోంది. దీంతో ఈ ఘటనపై నికిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.






