- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెల్లారితే పోలింగ్.. సర్పంచ్ అభ్యర్థి భర్త అదృశ్యం.. పోలింగ్ చివర్లో ప్రత్యక్షం
మెదక్ జిల్లాలో రెండో విడత సర్పంచ్ ఎన్నికల్లో హైడ్రామా నడిచింది.

దిశ, డైనమిక్ బ్యూరో: సర్పంచ్ ఎన్నికల్లో (Sarpanch Elections) చిత్ర విచిత్రమైన ఘటనలు చోటు చేసుకుంటున్నాయి. ఓట్ల కోసం అభ్యర్థులు నానా తంటాలు పడుతున్నారు. ఈ క్రమంలో మెదక్ (Medak District) జిల్లా చేగుంట మండలం గొల్లపల్లిలో జరిగిన ఘటన స్థానికంగా హైడ్రామా క్రియేట్ చేసింది. ఈ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థిగా బరిలో ఉన్న చెర్యాల సబిత భర్త జనార్ధన్ రెడ్డి అదృశ్యం కావడం గ్రామంలో తీవ్ర కలకలం రేపింది. తెల్లారితే ఎన్నికలు జరుగుతాయనగా అభ్యర్థి భర్త కనిపించకపోవడంతో ఆయన ఏమైపోయారనే టెన్షన్ సర్వత్రా నెలకొంది. ఈ ఘటనపై ఫిర్యాదు రావడంతో పోలీసులు జనార్ధన్ రెడ్డి ఆచూకి కనిపెట్టేందుకు రంగంలోకి దిగారు. డ్రోన్ల సహాయంతో గ్రామం పరిసర ప్రాంతాల్లో గాలించారు. ఈ క్రమంలో ఇవాళ ఉదయం గ్రామంలోని వరిపొలాల్లో జనార్ధన్ రెడ్డి ఆచూకీని కనిపెట్టి గ్రామంలో తీసుకువచ్చారు.
ఓట్ల కోసమే ఇదంతా డ్రామా:
అయితే తన భర్త చనిపోయాడనే సానుభూతితో ఓట్లు దండుకోవాలనే పథకంతోనే సబితా, ఆమె భర్త ఇలా చేశారని సబిత ప్రత్యర్థులు ఆరోపించారు. తన భర్తను చంపేశారని అందువల్ల మీరంతా తనను గెలిపించాలని సబిత ఇవాళ ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించిందని దీంతో ఓటర్లు సానుభూతితో వన్ సైడ్ గా ఆమెకే ఓటు వేశారని ఆరోపించారు. ఓటర్ల వద్దకు మేము వెళ్తే మీలాంటి హత్యా రాజకీయాలు చేసే వారు తమకు వద్దంటూ మొఖం ముందే చెప్పేశారని ఆవేదన వ్యక్తం చేశారు. 75 శాతం పోలింగ్ పూర్తయ్యాక ఆయన ఎలాంటి గాయాలు లేకుండా క్షేమంగా వచ్చారని అందువల్ల ఇక్కడ రీపోలింగ్ నిర్వహించాలని డిమాండ్ చేశారు.
పోలీసు వాదన ఇది:
జనార్ధన్ రెడ్డి అదృశ్యంపై పోలీసు మరో వాదన చెప్పారు. గత రాత్రి జనార్ధన్ రెడ్డి ప్రచారం నిర్వహిస్తుండగా పోలీసులు వస్తున్నారనే భయంతో గ్రామం నుంచి పారిపోయారని ఈక్రమంలో వరిపొలాల్లో పరిగెత్తుతూ పడిపోయారని చెప్పారు. గాయాలతో ఎక్కడికి కదలలేక అక్కడే ఉండిపోయారని చెప్పారు. ఉదయం డ్రోన్ల సాయంతో వెతికించే క్రమంలో ఆయన ఆచూకి కనుకొన్నామని చెప్పారు. ఈ ఘటనతో గ్రామంలో హైడ్రామా నెలకొంది.






