- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిందని రెండు హత్యలు, ఓ ఆత్మహత్య
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత మనస్తాపంతో తాను ఆత్మహత్య చేసుకున్నాడు.

తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణం చోటచేసుకుంది. ఓ తండ్రి తన ఇద్దరు పిల్లల్ని చంపేశాడు. ఆ తర్వాత మనస్తాపంతో తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కొండాపూర్ మండలం మల్కాపూర్‌లో జరిగింది. కుటుంబంలో కలహాలతో తన భార్య ఇంటి నుంచి వెళ్లిపోయింది. దీంతో తీవ్ర మనస్తాపం చెందిన సుభాష్ తన ఇద్దరు పిల్లల్ని గొంతు నులిమి చంపి ఆ తర్వాత తాను ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ లింక్‌లో ఉన్నాయి. క్లిక్ చేసి తెలుసుకోండి.
అవినీతి కేసులో రాజస్తాన్ ఎమ్మెల్యే అరెస్టయ్యారు. బాగిడోరాకు చెందిన భారత్ ఆదివాసీ పార్టీ ఎమ్మెల్యే జై కృష్ణ పటేల్.. అసెంబ్లీలో మైనింగ్ సంబంధించి మూడు ప్రశ్నలు అడిగేందుకు సిద్ధమయ్యారు. అయితే, వాటిని తొలగించేందుకు సంబంధిత మైనింగ్ కంపెనీ ఎమ్మెల్యేను సంప్రదించింది. దీనికిగాను జై కృష్ణ రూ.10 కోట్లు డిమాండ్ చేశారు. అయితే అది రూ.2.5 కోట్లకు ఒప్పందం కుదిరింది. ఈ డబ్బులను ఎలా తీసుకున్నాడు? ఎంత తీసుకున్నాడో తెలియాలంటే ఈ లింక్‌ను ఓపెన్ చేసి చూడాల్సిందే.
జమ్ముకశ్మీర్‌లో ఉగ్రవాదులకు సాయం చేస్తున్న వ్యక్తి పోలీసుల నుంచి తప్పించుకునే క్రమంలో ప్రాణాలు కోల్పోయాడు. కుల్గాంలో జిల్లాలో ఈ ఘటన జరుగగా.. పోలీసులు అతడి డెడ్‌బాడీని స్వాధీనం చేసుకున్నారు. పారిపోయే క్రమంలో సదరు వ్యక్తి నదిలో దూకి ప్రాణాలు కోల్పోయాడు. ఉగ్రవాదులకు 23 ఏళ్ల ఇంతియాజ్ అహ్మద్ సహకరించినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించగా నేరం అంగీకరించాడు. ఉగ్రవాదులు ఉన్న ప్రాంతాన్ని చూపిస్తాననడంతో అటవీ ప్రాంతం వైపు వెళ్లగా మార్గమధ్యలో ఇంతియాజ్ వేషా నదిలోకి దూకేశాడు. అయితే, నీటి ప్రవాహానికి కొట్టుకుపోయి చనిపోయాడు. ఈ ఘటనపై పలు ఆరోపణలు వచ్చాయి. అవేంటో ఈ లింక్ ఓపెన్ చేసి చూడండి.
కృష్ణానది యాజమాన్య బోర్డుకు ఏపీ ప్రభుత్వం లేఖ రాసింది. ఇవాల్టి త్రిసభ్య కమిటీ సమావేశానికి హాజరు కాలేమని స్పష్టం చేసింది. పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు నిపుణులు వస్తున్నారని ఆ కారణంతో తాము సమావేశానికి హాజరు కాలేకపోతున్నామని వివరించారు. ఈ నెల 10 తర్వాత త్రిసభ్య కమిటీ భేటీ ఏర్పాటు చేయాలని ఏపీ ఈఎన్సీ సూచించారు. ఇకపై కృష్ణ బోర్డు సమావేశాలు విజయవాడలోనే పెట్టాలని ఆయన కోరారు. మరిన్ని వివరాల కోసం ఈ లింక్‌ను క్లిక్ చేయండి.






