- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HRC: బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ ఘటన.. మానవ హక్కుల కమిషన్ సుమోటోగా కేసు నమోదు
బీసీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో (Suo-Motu)గా కేసు నమోదు చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: గద్వాల జిల్లా ఎర్రవల్లి మండలం ధర్మవరం గ్రామంలోని బీసీ సంక్షేమ బాలుర హాస్టల్‌లో జరిగిన ఫుడ్ పాయిజన్ (food poisoning) ఘటనపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ సుమోటో (Suo-Motu)గా కేసు నమోదు చేసింది. నవంబర్ 1, 2025న ఓ తెలుగు దినపత్రికలో ప్రచురితమైన “ధర్మవరం బీసీ హాస్టల్లో ఫుడ్ పాయిజన్ – 55 మంది విద్యార్థులకు అస్వస్థత” అనే వార్తపై కమిషన్ స్పందించింది.
శుక్రవారం రాత్రి విద్యార్థులు భోజనం చేసిన అనంతరం అస్వస్థతకు గురైన ఘటన ఆహార భద్రత, పరిశుభ్రత, పర్యవేక్షణలో తీవ్ర లోపాలను సూచిస్తోందని కమిషన్ వ్యాఖ్యానించింది. ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నివేదిక సమర్పించాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. కమిషన్ సూచనల ప్రకారం, విచారణ అనంతరం సమగ్ర నివేదికను నవంబర్ 24, 2025 ఉదయం 11 గంటలలోగా సమర్పించాల్సిందిగా ఆదేశించారు. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (Telangana State Human Rights Commission) శనివారం ఒక ప్రకటన విడుదల చేసింది.






