- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
అడ్వకేట్ స్వప్న హత్య కేసు.. డీజీపీకి మానవ హక్కుల కమిషన్ నోటీసులు
న్యాయవాది స్వప్న హత్య కేసులో పోలీసుల తీరుపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ తీవ్రంగా స్పందించి.. డీజీపీకి ఆదేశాలిచ్చింది

దిశ, డైనమిక్ బ్యూరో : (Advocate Swapna Case) న్యాయవాది జి. స్వప్న కుమారి (34) హత్య కేసులో పోలీసుల తీరుపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TGHRC) తీవ్రంగా స్పందించింది. తన ప్రాణాలకు ముప్పు ఉందని మృతురాలు ముందుగానే హెచ్చరించినప్పటికీ, మొయినాబాద్ పోలీసులు రక్షణ కల్పించడంలో విఫలమయ్యారన్న ఆరోపణల నేపథ్యంలో, దీనిపై సమగ్ర నివేదిక సమర్పించాలని రాష్ట్ర డీజీపీని కమిషన్ ఆదేశించింది. ఈ నెల 4వ తేదీన (04.02.2026) చేవెళ్ల పరిధిలో జరిగిన భూ వివాదంలో న్యాయవాది జి. స్వప్న కుమారి దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. అయితే, ఈ హత్యను నివారించడంలో పోలీసులు తీవ్ర నిర్లక్ష్యం వహించారని ఆరోపిస్తూ 163 మంది న్యాయవాదులు మానవ హక్కుల కమిషన్‌ను ఆశ్రయించారు.
ముందే ఫిర్యాదు చేసినా..
తన సోదరుడి నుంచే తనకు ప్రాణహాని ఉందని స్వప్న కుమారి పోలీసులకు ముందే ఫిర్యాదు చేసినా, వారు సకాలంలో నివారణ చర్యలు తీసుకోలేదని, ఇది విధి నిర్వహణలో తీవ్ర అలసత్వమని న్యాయవాదులు తమ ఫిర్యాదులో (ఎస్.ఆర్. నం. 515/2026) పేర్కొన్నారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న TGHRC చైర్మన్ డాక్టర్ జస్టిస్ షమీమ్ అక్తర్, ఘటనపై పూర్తి వివరాలతో కూడిన నివేదికను అందజేయాలని డీజీపీకి ఆదేశాలు జారీ చేశారు. తదుపరి విచారణను మార్చి 6కి వాయిదా వేశారు.






