- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బిగ్ ట్రాఫిక్ అలర్ట్... విజయవాడ-హైదరాబాద్ మార్గంలో భారీ ట్రాఫిక్ జామ్
by Muthe.Rajitha |
విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే (NH-65)పై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది.

X
దిశ, వెబ్ డెస్క్ : విజయవాడ-హైదరాబాద్ నేషనల్ హైవే (NH-65)పై భారీగా ట్రాఫిక్ జాం నెలకొంది. భారీ వర్షాలు, పంద్రాగస్టు, కృష్ణాష్టమి పండుగలు వరుసగా రావడం, వీటితోపాటు వీకెండ్ కూడా కలిసి రావడంతో నగరవాసులు టూర్లకు, సొంతూళ్లకు వెళ్లారు. సెలవులు ముగియడంతో అందరూ ఒకేసారి మళ్ళీ నగర బాట పట్టారు. దీంతో హైదరాబాద్ వైపు వెళ్లే వాహనాల రద్దీ కారణంగా భారీ ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. అలాగే నల్గొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి వద్ద జరుగుతున్న ఫ్లైఓవర్ నిర్మాణ పనులు ఈ రద్దీకి మరో ప్రధాన కారణం.
పెద్దకాపర్తి నుంచి చిట్యాల వరకు భారీగా వాహనాలు రోడ్డుపై నిలిచిపోగా, వాహనదారులు గంటల తరబడి ట్రాఫిక్‌లో చిక్కుకున్నారు. పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ ను క్రమబద్ధీకరిస్తున్నారు. ప్రత్యామ్నాయ మార్గాలేవి సూచించకపోవడంతో ప్రయాణికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






