Rains: హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్‌..మునిగిపోయిన కార్లు !

by velandi.Saikiran |

భారీ వ‌ర్షం నేప‌థ్యంలో హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్ జామ్ అయింది.

Rains: హైదరాబాద్ లో భారీ ట్రాఫిక్‌..మునిగిపోయిన కార్లు !
X

దిశ‌, వెబ్ డెస్క్: హైదరాబాద్ మహా నగరంలో భారీ వర్షం పడుతోంది. మంగళవారం సాయంత్రం ప్రారంభమైన ఈ వర్షం... అర్ధరాత్రి అయినా త‌గ్గ‌డం లేదు. బుధవారం ఉదయం 8 గంటల వరకు హైదరాబాద్ మహా నగరంలోని పలు ప్రాంతాల్లో వర్షం పడే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప, బయటకు రాకూడదని ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు.

అయితే మంగళవారం సాయంత్రం కురిసిన వర్షం నేపథ్యంలో హైదరాబాద్ ఐటీ కారిడార్ లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. IKEA కూడలి వద్ద ఏకంగా 5 కిలో మీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయింది. 20 నిమిషాల జర్నీకి కూడా రెండు గంటల స‌మ‌యం పడుతోంది. ఈ నేపథ్యంలో వాహ‌న‌దారులు ఇంటికి చేరుకునేందుకు చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. దీంతో ట్రాఫిక్ కు సంబంధించిన‌ ఫోటోలు, వీడియోలు వైరల్ అవుతున్నాయి. ఇక అటు కొండాపూర్-కొత్తగూడ జంక్షన్ వద్ద రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈ క్రమంలో ఆటోలు, కార్లు మునిగిపోయాయి.

Next Story