ఫ్యాన్సీ నెంబర్లతో TG రవాణా శాఖకు భారీ ఆదాయం

by Gantepaka Srikanth |

రవాణా శాఖకు శుక్రవారం భారీ ఆదాయాన్ని సమకూర్చింది.

ఫ్యాన్సీ నెంబర్లతో TG రవాణా శాఖకు భారీ ఆదాయం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రవాణా శాఖకు శుక్రవారం భారీ ఆదాయాన్ని సమకూర్చింది. ఖైరతాబాద్‌ RTA కార్యాలయంలో పది నంబర్ల కోసం జరిగిన ఫ్యాన్సీ నెంబర్ల వేలం పాటలో రూ.63,77,361 మేర భారీ ఆదాయం లభించింది. ఇందులో అత్యధికంగా TG09G9999 నంబర్‌కు రూ.25,50,200 చెల్లించి హెటెరో డ్రగ్స్ లిమిటెడ్ కైవసం చేసుకుంది. అలాగే TG09H0009 నంబర్‌ను ఏఆర్‌ఎల్ టైర్స్ లిమిటెడ్ రూ.6,50,009కి దక్కించుకోగా, TG09H0001 నంబర్‌ను డాక్టర్ రాజేశ్వరి స్కిన్ అండ్ హెయిర్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ రూ.6,25,999కి పొందింది. TG09H0006 నంబర్‌ను ఏఎంఆర్ ఇండియా లిమిటెడ్ రూ.5,11,666కి కొనుగోలు చేసింది. ఇక TG09H0005 రూ.2,22,000, TG09H0007 రూ.1,51,999, TG09H0099 రూ.1,30,999, TG09G9990 రూ.1,22,000, TG09H0027 రూ.1,04,999, TG09H0234 రూ.1,01,234ల ఆదాయాన్ని తీసుకువచ్చాయి. ఫ్యాన్సీ నంబర్ల కోసం బిడ్డర్ల మధ్య భారీ పోటీ నెలకొనడంతో రవాణా శాఖకు భారీ ఆదాయం వచ్చింది.

Next Story