- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
TG: ఫీజు పెంచినా తగ్గని పోటీ.. ‘లిక్కర్’ అప్లికేషన్స్ ద్వారా భారీ ఆదాయం
వైన్ షాప్‌ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అప్లికేషన్ల వల్ల సర్కారుకు దాదాపు రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

దిశ, తెలంగాణ బ్యూరో: వైన్ షాప్‌ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు ప్రభుత్వం తాజాగా నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ అప్లికేషన్ల వల్ల సర్కారుకు దాదాపు రూ.5 వేల కోట్ల ఆదాయం వస్తుందని అధికారులు అంచనా వేస్తున్నారు. అప్లికేషన్ రుసుము గతంలో రూ.2 లక్షలు ఉండగా.. దానిని రూ.3 లక్షలకు పెంచారు. మరోవైపు మద్యం షాపులను దక్కించుకుంటే మంచి లాభాలు వస్తాయని దరఖాస్తు దారులు భావిస్తున్నారు. దీంతో గతంలో కన్నా ఎక్కువ మంది దరఖాస్తు చేస్తారని అధికారుల అంచనా.
గతంలో 1.32 లక్షల దరఖాస్తులు
వైన్ షాపుల లైసెన్స్‌కు పోయిన సారి దాదాపు 1.32 లక్షల దరఖాస్తులు వచ్చాయి. దీని వల్ల అప్పటి సర్కారుకు రూ.2,645 కోట్ల ఆదాయం వచ్చింది. ఈ సారి ఫీజును అదనంగా రూ.లక్ష పెంచడంతో అదనపు ఆదాయం సమకూరుతుందని అంచనా వేస్తున్నారు. షాపుల కేటాయింపు ప్రక్రియ పైరవీలు లేకుండా ఉండటం, ప్రజల ముందే లక్కీ డ్రా నిర్వహించి షాపులను కేటాయిస్తుండటంతో చాలా మంది దరఖాస్తు చేసుకునేందుకు మొగ్గు చూపుతున్నారని అధికారులు భావిస్తున్నారు. ఒక వేళ లక్కీ డ్రాలో షాపు దక్కితే, పెద్ద ఎత్తున గుడ్ విల్ తీసుకుని ఆ షాపును మరో వ్యక్తికి లీజుకు ఇవ్వొచ్చనే ఆశతో సాఫ్ట్‌వేర్ ఎంప్లాయీస్‌తో పాటు సర్కారు ఉద్యోగులు సైతం పోటీలు పడి దరఖాస్తు చేసే అవకాశముందని అధికారులు అంచనా వేస్తున్నారు.






