- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
HMDA మేడిపల్లి లేఅవుట్ ప్రీ-బిడ్‌కు బిగ్ రెస్పాన్స్.. జూన్ 24న ప్లాట్ల ‘ఈ-వేలం’
హెచ్ఎండీఏ మేడిపల్లి లేఅవుట్ ఈ-వేలానికి సంబంధించి నిర్వహించిన ప్రీ-బిడ్ సమావేశానికి భారీ స్పందన లభించింది.

దిశ, తెలంగాణ బ్యూరో: హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (HMDA) ఆధ్వర్యంలో ప్రతిపాదిత మేడిపల్లి లేఅవుట్‌కు సంబంధించి ప్రాజెక్టు స్థలంలో మంగళవారం ప్రీ-బిడ్ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఈ-ఆక్షన్ పై ఆసక్తిగా ఉన్న 200 మందికిపైగా ఆశావాహులు ఉత్సాహంగా హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. సమావేశానికి హాజరైన అధికారులు, ప్రతినిధులు పాల్గొన్న వారి సందేహాలను నివృత్తి చేశారు. అయితే ఈ లేఅవుట్ లోని ప్లాట్లకు ఈనెల 24వ తేదీన ఈ-ఆక్షన్ నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమంలో మేడిపల్లి లేఅవుట్ ముఖ్యాంశాలను వివరించి, బిడ్డర్లు అడిగిన విభిన్న ప్రశ్నలకు హెచ్ఎండీఏ డిప్యూటీ కలెక్టర్ వై. సుదర్శన్ సమాధానాలు అందించారు. హెచ్‌ఎండీఏ – లేఅవుట్ ప్రణాళికా అంశాలు, అభివృద్ధి ప్రతిపాదనలకు సంబంధించిన సందేహాలను చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ (సీపీఓ) ఎ. రవీందర్ రెడ్డి నివృత్తి చేశారు. ఈ-వేలం ప్రక్రియ, నమోదు విధానం, బిడ్డర్ల భాగస్వామ్య మార్గదర్శకాల గురించి ఎంఎస్‌టీసీ ప్రతినిధి సిద్ధార్థ్ వివరించారు.
లేఅవుట్‌లో చేపట్టిన అభివృద్ధి పనుల గురించి వివరించి, పాల్గొన్న వారి సాంకేతిక సందేహాలకు డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం. సత్యప్రసాద్ సమాధానాలు ఇచ్చారు. మేడిపల్లి లేఅవుట్ ప్రత్యేకతలు, ముఖ్యమైన అంశాలను వివరిస్తూ కేపీఎంజీ ప్రతినిధి కళ్యాణ్ పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను సమర్పించారు.






