- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాజీవ్ స్వగృహ ప్లాట్లకు భారీ స్పందన.. సర్కార్‌కు రూ.100 కోట్ల ఆదాయం
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్ల వేలానికి భారీ స్పందన లభించిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు.

దిశ, వెబ్‌డెస్క్: మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలోని బహదూర్‌పల్లి ప్రాంతంలోని 68 ప్లాట్ల వేలానికి భారీ స్పందన లభించిందని రాజీవ్ స్వగృహ మేనేజింగ్ డైరెక్టర్ వీపీ గౌతం తెలిపారు. ప్లాట్లకు సంబంధించిన బహిరంగ వేలం ప్రక్రియను మంగళవారం చేపట్టారు. రాత్రి 8 గంటల వరకు 50 ప్లాట్లకు సంబధించి నిర్వహించిన వేలం పాటలో గరిష్టంగా చదరపు గజానికి 46,500 ధర పలికింది. వేలం నిర్వహించిన 50 ప్లాట్ల విక్రయానికి సంబంధించి సుమారు రూ.100 కోట్ల మేర ఆదాయం వచ్చినట్లు ఎండీ తెలిపారు. అవుటర్ రింగ్ రోడ్‌కు అతి సమీపంలోని ఈ భూములను కొనుగోలు చేయడానికి సుమారు 119 మంది బిడ్డర్లు పాల్గొన్నారు. 200- 1000 చదరపు గజాల విస్తీర్ణంలో ఉన్న ప్లాట్లలో, కార్నర్ ప్లాట్‌కు రూ.30 వేలు, ఇతర ప్లాట్లకు రూ.27 వేలు ఆఫ్ సెట్ ధరగా నిర్ణయించారు. ఈ ప్లాట్ల కొనుగోలు ఒక్కో ప్లాట్ కోసం దాదాపు 30 మంది వరకు పోటీ పడ్డారు. కార్నర్ ప్లాట్లకు మంచి డిమాండ్ రేటు పలికింది.






