- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సింగరేణి కార్మికులకు భారీ ఊరట.. వారికి ప్రత్యేక సెలవులు
తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారిన పడిన సింగరేణి కార్మికులకు 50 శాతం వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.

దిశ, తెలంగాణ బ్యూరో: తీవ్ర కాలేయ వ్యాధి (లివర్ సిరోసిస్) బారిన పడిన సింగరేణి కార్మికులకు 50 శాతం వేతనంతో ప్రత్యేక సెలవు మంజూరు చేయనున్నట్లు సింగరేణి యాజమాన్యం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటి వరకు ఈ వెసులుబాటును ఏడు తీవ్ర వ్యాధులకు మాత్రమే వర్తింప చేస్తున్నారు. గుండె జబ్బు, క్షయ, క్యాన్సర్, కుష్టు, పక్షవాతం, మూత్ర కోశ వ్యాధులు, ఎయిడ్స్ , మెదడు వ్యాధులుకు ఈ స్పెషల్ లీవ్ ఇస్తున్నారు. కాగా ఇటీవల కోల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎన్సీడబ్ల్యూఏ 11వ వేతన ఒప్పందంలో లివర్ సిరోసిస్ (తీవ్ర కాలేయ వ్యాధి) బాధితులకు కూడా స్పెషల్ లీవ్ వర్తింపచేయాలని నిర్ణయించడంతో సింగరేణి యాజమాన్యం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది.
తీవ్ర కాలేయ వ్యాధికి గురైన కార్మికునికి స్పెషల్ లీవు మంజూరు చేయవచ్చని, వ్యాధి నయమై, విధులకు ఫిట్ అయ్యేంతవరకు అతనికి 50 శాతం వేతన మొత్తం (బేసిక్ పే, వీడిఏ, ఎస్ డి ఏ లో 50 శాతం ) చెల్లించవచ్చని సర్క్యులర్ లో పేర్కొన్నారు.
- Tags
- SCCL






