TG: రేపటినుంచే ఎగ్జామ్స్.. ఇంటర్ విద్యార్థులకు ఊరట

by Gantepaka Srikanth |

రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది.

TG: రేపటినుంచే ఎగ్జామ్స్.. ఇంటర్ విద్యార్థులకు ఊరట
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు నేటి నుండి ప్రారంభం కానున్న నేపథ్యంలో, బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు తమ హాల్ టికెట్లను చూపి నేరుగా పరీక్షా కేంద్రాల్లోకి ప్రవేశించవచ్చని, వాటిపై ప్రిన్సిపల్ సంతకం ఉండాలనే నిబంధన లేదని స్పష్టం చేసింది. నేటి నుండి మార్చి 18 వరకు రాష్ట్రవ్యాప్తంగా పరీక్షలు జరగనున్నాయి. పరీక్షా కేంద్రాలకు వెళ్లే విద్యార్థులకు ఎలాంటి ఆంక్షలు ఉండవు. కేవలం హాల్ టికెట్ చూపిస్తే సరిపోతుందని పేర్కొంది. గతంలో హాల్ టికెట్లపై సంతకాల కోసం విద్యార్థులు కళాశాలల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కొన్ని యాజమాన్యాలు ఫీజుల బకాయిల సాకుతో హాల్ టికెట్లను నిలిపివేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో, విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు బోర్డు ఈ నిర్ణయం తీసుకుంది. విద్యార్థులు సమయానికి పరీక్షా కేంద్రాలకు చేరుకునేలా రవాణా, స్థానిక యంత్రాంగం సహకరించాలని బోర్డు కోరింది. ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండటానికి విద్యార్థులు ఇంటి నుండి త్వరగా బయలుదేరాలని, తప్పనిసరిగా హాల్ టికెట్ వెంట తెచ్చుకోవాలని బోర్డు కార్యదర్శి సూచించారు.

Next Story