- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Agrigold : అగ్రిగోల్డ్ బాధితులకు భారీ ఊరట
అగ్రిగోల్డ్ స్కాం(Agrigold Scam)లో మోసపోయిన 19 లక్షల మంది బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ (ED) చురుగ్గా పని చేస్తోంది.

X
దిశ, వెబ్ డెస్క్ : అగ్రిగోల్డ్ స్కాం(Agrigold Scam)లో మోసపోయిన 19 లక్షల మంది బాధితులకు న్యాయం చేసేందుకు ఈడీ (ED) చురుగ్గా పని చేస్తోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, ఒడిశా, అండమాన్ నికోబార్ దీవుల్లోని ఈ బాధితుల నుంచి అగ్రిగోల్డ్ సంస్థ 32 లక్షల ఖాతాల ద్వారా రూ.6,380 కోట్లు వసూలు చేసి మోసం చేసింది. ఈడీ ఇప్పటి వరకు రూ.4,141 కోట్ల విలువైన 2,310 ఆస్తులను జప్తు చేసి, వాటిని వేలం వేసి డిపాజిటర్లకు చెల్లించే పనిలో ఉంది. ఈ కేసులో 33 మందిపై చార్జిషీట్ దాఖలు చేసిన ఈడీ, రూ.3,339 కోట్ల ఆస్తులను ఆంధ్రప్రదేశ్ సీఐడీకి బదిలీ చేయనుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గతంలో రూ.940 కోట్లు చెల్లించగా, ఇప్పుడు జప్తు ఆస్తుల విక్రయం ద్వారా మరింత నిధులు బాధితులకు అందజేయనుంది. సీబీఐ, సీఐడీ సహకారంతో ఈ ప్రక్రియ కొనసాగుతోంది.
Next Story






