అమ్మో.. ఎంత పెద్ద కొండ చిలువో! ఖమ్మం జిల్లాలో రోడ్డుపై భారీ కొండచిలువ

by Ramesh Naini |

సాధారణంగా అడవిలో ఉండే భారీ కొండ చిలువలు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి.

అమ్మో.. ఎంత పెద్ద కొండ చిలువో! ఖమ్మం జిల్లాలో రోడ్డుపై భారీ కొండచిలువ
X

దిశ, డైనమిక్ బ్యూరో: సాధారణంగా అడవిలో ఉండే (Huge python) భారీ కొండ చిలువలు అప్పుడప్పుడు జనావాసాల్లోకి వస్తుంటాయి. వాటిని చూసి జనం భయభ్రాంతులకు గురి కావడం.. లేదా ఏదైనా సాహసం చేయడం, దాని దారిన దాన్ని పోనివ్వడం చేస్తుంటారు. ఈ క్రమంలోనే తాజాగా (Khammam district) ఖమ్మంలో జిల్లాలో రోడ్డుపై భారీ కొండచిలువ ప్రత్యక్షమయ్యింది. ఖమ్మం రూరల్ మండల కేంద్రంలో కరుణగిరి బైపాస్ రోడ్డు వద్ద భారీ కొండచిలువ రోడ్‌పై కనిపిచింది. ఈ క్రమంలోనే ఓ వాహనదారుడు కొండచిలువను చూసి అప్రమత్తం చేయడంతో వాహనాలు నిలిపివేశారు. దీంతో కొండచిలువ రోడ్డు దాటి పక్కనే ఉన్న పొదల్లోకి వెళ్ళిపోయింది. కొండచిలువ రోడ్డు దాటుతుండగా వాహనాలను నిలిపివేసి.. దానికి ఎలాంటి హాని జరగకుండా రోడ్డు దాటేల చేశారు. ఈ క్రమంలోనే కొంతమంది యువకులు అమ్మో ఎంత పెద్ద కొండ చిలువో అని తమ ఫోన్లలో కొండచిలువను బంధిస్తూ ఎంజాయ్ చేశారు. తాజాగా ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది.

Next Story