హైదరాబాద్‌లో భారీ జీఎస్టీ ఎగవేత కుంభకోణం: ఎకోరెన్ ఎనర్జీ ఎండీ అరెస్ట్

by Ramesh Naini |

హైదరాబాద్‌లో భారీ జీఎస్టీ ఎగవేత కుంభకోణం: ఎకోరెన్ ఎనర్జీ ఎండీ అరెస్ట్
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌ నగరంలో భారీ జీఎస్టీ ఎగవేత కేసు వెలుగులోకి వచ్చినట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ కేసులో రెన్యువబుల్ ఎనర్జీ రంగానికి చెందిన ఎకోరెన్ ఎనర్జీ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ లక్ష్మీప్రసాద్ యెర్నేనిని జీఎస్టీ అధికారులు అరెస్ట్ చేశారు. నకిలీ ఇన్‌వాయిస్‌ల ఆధారంగా సుమారు రూ.64.5 కోట్ల ఇన్‌పుట్ ట్యాక్స్ క్రెడిట్ (ఐటీసీ) క్లెయిమ్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి.

షెల్ కంపెనీల నెట్‌వర్క్‌ను వినియోగించి పలు బ్యాంకు ఖాతాల ద్వారా నిధులు మళ్లించినట్లు దర్యాప్తులో గుర్తించిన అధికారులు, సీజీఎస్టీ చట్టంలోని సెక్షన్ 132(1)(c), 132(1)(i) కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని కోర్టులో హాజరుపరచగా, ఆగస్టు 7 వరకు జ్యుడీషియల్ కస్టడీ విధిస్తూ చంచల్‌గూడ జైలుకు తరలించాలని ఆదేశాలు జారీ అయ్యాయి.

Next Story