- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Bhatti Vikramarka : నిరుద్యోగ యువతకు భారీ గుడ్ న్యూస్
నిరుద్యోగ యువత(UnEmployed Youth)కు భారీ శుభవార్త ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం.

దిశ, వెబ్ డెస్క్ : నిరుద్యోగ యువత(UnEmployed Youth)కు భారీ శుభవార్త ప్రకటించింది రాష్ట్ర ప్రభుత్వం. మంగళవారం తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క(Deputy CM Bhatti Vikramarka) హైదరాబాద్ లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రంలోని నిరుద్యోగ యువతీ యువకులు తమ కాళ్ళపై తాము నిలబడేందుకు కొత్త పథకాన్ని ప్రవేశ పెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా రూ. 6 వేల కోట్ల రూపాయలతో "రాజీవ్ యువ వికాస్"(Rajeev Yuva Vikas) పేరుతో మొదలు పెట్టబోతున్న ఈ పథకంలో.. దాదాపు 5 లక్షల మందికి ఒక్కొక్కరికీ రూ. 3 లక్షలకు తగ్గకుండా స్వయం ఉపాధికి అందిస్తామని తెలియజేశారు.
ఈ పథకాన్ని మార్చ్ 15 నుంచి ఏప్రిల్ 5 వరకు కార్పొరేషన్ల ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తామని, అనంతరం వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజున సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) చేతుల మీదుగా అర్హులకు శాంక్షన్ లెటర్స్ అందిస్తామని వెల్లడించారు. ఈ పథకానికి చెందిన పూర్తి విధివిధానాలను రేపు మరోసారి మీడియా సమావేశం నిర్వహించి తెలియజేస్తామని అన్నారు. అలాగే రాష్ట్రంలోని యూనివర్సిటీలకు రూ.540 కోట్లతో వసతుల ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణలోని వారసత్వ కట్టడాలను కాపాడేందుకు మొదటి విడతాగా రూ.115.5 కోట్లు కేటాయిస్తున్నామని పేర్కొన్నారు. మూసీ సుందరీకరణ అనంతరం చాకలి ఐలమ్మ యూనివర్సిటీకి ప్రధాన ద్వారాన్ని వినియోగిస్తామని తెలిపారు.






