- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. HCA హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ ప్రారంభం
నగరంలోని రాయదుర్గం (Rayadurgam)లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (HCA Healthcare Global Capability Center)ను ఇవాళ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రారంభించారు.

దిశ, వెబ్‌డెస్క్: నగరంలోని రాయదుర్గం (Rayadurgam)లో హెచ్‌సీఏ హెల్త్‌కేర్ గ్లోబల్ కేపబిలిటీ సెంటర్ (HCA Healthcare Global Capability Center)ను ఇవాళ ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు (Minister Sridhar Babu) ప్రారంభించారు. HCA హెల్త్‌కేర్ ఓ ప్రముఖ అమెరికన్ హెల్త్‌కేర్ సర్వీసెస్ ప్రొవైడర్‌గా హైదరాబాద్ కేంద్రంగా పనిచేస్తుంది. 4 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించబడిన ఈ కేపబిలిటీ సెంటర్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), మెషిన్ లెర్నింగ్ (ML), డేటా సైన్స్, అనలిటిక్స్ రంగాలలో ప్రతిభావంతులను తీర్చిదిద్దడంపై దృష్టి సారించనుంది.క
కాగా, GCC, HCA హెల్త్‌కేర్ కెపబిలిటీ సెంటర్ గ్లోబల్ ఆపరేషన్స్‌కు కీలకమైన హబ్‌గా పని చేస్తుంది. టెక్నలాజికల్ ఆవిష్కరణలను ప్రోత్సహించి అధిక నాణ్యత గల హెల్త్‌కేర్ అందించేందుకు ఈ సెంటర్ దన్నుగా పని చేయనుంది. 2025 చివరి నాటికి హెచ్‌సీఏ హెల్త్ కేర్ గ్లోబర్ కేపబిలిటీ సెంటర్ హైదరాబాద్‌లో 75 మిలియన్ డాలర్ల పెట్టుబడి లక్ష్యంగా పెట్టుకుంది. ఈ ఒక్క ఏడాదిలోనే 1,200 మందికి ఉద్యోగ అవకాశాలు 2026 నాటికి మరో 3 వేల మందికి జాబ్స్ రానున్నాయి. హెచ్‌సీఏ హెల్త్‌కేర్ అమెరికా, యూకేలో ప్రధాన కార్యకలాపాలను కొనసాగిస్తుంది. 190 ఆసుపత్రులు, 2,400 కేర్ సైట్లు, 3.16 లక్షల ఉద్యోగులు, వార్షిక ఆదాయం 70 బిలియన్ డాలర్లు హెచ్‌సీఏ హెల్త్‌కేర్ సొంతం.






