నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 2,837 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!

by Muthe.Rajitha |

నిరుద్యోగులకు భారీ గుడ్ న్యూస్.. 2,837 ఉద్యోగాలకు త్వరలో నోటిఫికేషన్!
X

దిశ, వెబ్ డెస్క్ : రాష్ట్రంలో కొలువుల జాతరకు తెర లేవనుంది. నిరుద్యోగులకు రేవంత్ సర్కారు త్వరలో భారీ గుడ్ న్యూస్ వినిపించనుంది. 2,837 ఉద్యోగాలకు త్వరలోనే నోటిఫికేషన్ రానుందని తెలుస్తోంది. కాగా తెలంగాణలోని ప్రభుత్వ స్కూళ్లలో 2,837 కంప్యూటర్ టీచర్లను (ఐసీటీ ఇన్‌స్ట్రక్టర్లు) నియమించనున్నారు.

విద్యార్థులకు ఐటీలో శిక్షణ ఇవ్వడానికి ఔట్ సోర్సింగ్ విధానంలో టీచర్లను భర్తీ చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తెలంగాణ టెక్నాలజీ సర్వీసెస్ ద్వారా ఈ నియామక ప్రక్రియ చేపట్టనున్నారు. నెలకు గౌరవ వేతనంగా రూ.15వేలు చెల్లించనున్నారు. త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసి అర్హుల నుంచి దరఖాస్తులు స్వీకరించనున్నారు.

Next Story