Good News : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్!

by Muthe.Rajitha |

తెలంగాణ(Telangana) ప్రజలకు రాష్ట్ర సర్కార్ భారీ శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది.

Good News : తెలంగాణ ప్రజలకు భారీ గుడ్ న్యూస్!
X

దిశ, వెబ్ డెస్క్ : తెలంగాణ(Telangana) ప్రజలకు రాష్ట్ర సర్కార్ భారీ శుభవార్త వినిపించేందుకు సిద్ధమైంది. ఒకేసారి నాలుగు పథకాలను అమలు చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. కాంగ్రెస్ ఎన్నికల్లో ఇచ్చిన గ్యారెంటీలను(Election Guarnatees) పూర్తి స్థాయిలో అమలు చేసేందుకు శరవేగంగా పనులు చేపట్టింది. ఇప్పటికే.. మహిళలకు ఉచిత బస్సు(Mahalakshmi Scheme), రూ.500 గ్యాస్ సిలిండర్, ఫ్రీ కరెంట్, రైతులకు రుణమాఫీ, ఆరోగ్యశ్రీ సాయం రూ.10లక్షలకు పెంపు వంటి వాటిని అమలు చేసింది. మరిన్ని రోజుల్లో మరో నాలుగు కొత్త పథకాలు ప్రారంభించేందుకు సిద్ధమైంది. జనవరి 26 నుంచి రైతు భరోసా(Raithu Bharosa) పంట పెట్టుబడి సాయం, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా(Indiramma Athmiya Bharosa), కొత్త రేషన్ కార్డులు(New Ration Cards), ఇందిరమ్మ ఇళ్ల(Indiramma Houses) పథకాలను తెలంగాణ ప్రభుత్వం అమలు చేయనుంది.. ఈ నేపథ్యంలో వీటికి సంబంధించి లబ్ధిదారుల జాబితా తయారీకి ప్రభుత్వం ఇవాళ్టి నుంచి ఫీల్డ్ సర్వే చేపట్టనుంది. ఈ మేరకు సీఎస్ శాంతికుమారి అధికారులను ఆదేశించారు. గురువారం నుంచి ఫీల్డ్ సర్వే తర్వాత.. ఈ నెల 21నుంచి 24 వరకు గ్రామసభలు, డేటా ఎంట్రీ చేయనున్నారు. ఈ డేటా ఆధారంగా తుది జాబితాకు మంత్రులు ఆమోదం తెలపనున్నారు.

Next Story