- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హైదరాబాద్‌లో అపశృతి.. నేలకొరిగిన భారీ గణనాథుడు
గణపతి(Ganapathi) నవరాత్రి ఉత్సవాల వేళ గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో అపశృతి చోటుచేసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: గణపతి(Ganapathi) నవరాత్రి ఉత్సవాల వేళ గ్రేటర్ హైదరాబాద్(Hyderabad)లో అపశృతి చోటుచేసుకుంది. ఉప్పల్ పరిధిలోని రామంతాపూర్(Ramanthapur)లో భారీ గణనాథుడు నేలకొరిగాడు. విగ్రహాన్ని కొనుగోలు చేసి మండపానికి తరలిస్తున్న సమయంలో సోమవారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. ఆ సమయంలో సమీపంలో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. విషయం తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. అనంతరం నిర్వహకులకు పలు సూచనలు చేశారు. కాగా, ఇటీవల రామంతాపూర్‌లో విద్యుత్ షాక్ తగిలి ఏడుగురు మృతిచెందిన విషయం తెలిసిందే. ఆ తర్వాత నగరంలోని పాతబస్తీ బండ్లగూడలో గణేశ్ విగ్రహాన్ని తరలిస్తుండగా విద్యుదాఘాతానికి గురై ఇద్దరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. విద్యుత్ తీగలను కర్రతో పైకి లేపుతున్న క్రమంలో షాక్ తగిలి ప్రమాదం జరిగింది. వరుస ప్రమాదంలో పోలీసులు అప్రమత్తం అయ్యారు. మండపాల నిర్వహకులకు పలు సూచనలు చేశారు.






