- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్ పుట్టినరోజు వేడుకలు.. ఏపీలో కేసీఆర్, కేటీఆర్ ఫొటోలతో భారీ ఫ్లెక్సీ
వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: వైఎస్సార్‌సీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి పుట్టినరోజు సందర్భంగా పార్టీ శ్రేణులు, అభిమానులు పెద్ద ఎత్తున వేడుకలు నిర్వహిస్తున్నారు. డిసెంబర్ 21న జరగనున్న జగన్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రవ్యాప్తంగా ఫ్లెక్సీలు, బ్యానర్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కార్యాలయం పరిసరాల్లో ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. జగన్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, ‘సంక్షేమ ప్రదాత జగనన్న’ అనే నినాదంతో తెలంగాణ బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఫొటోలతో కూడిన భారీ ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు.
కేసీఆర్, కేటీఆర్‌లతో కలిసి జగన్ ఉన్న చిత్రాలు రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేపాయి. హైదరాబాద్ శేరిలింగంపల్లికి చెందిన రవీందర్ యాదవ్ ఈ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. జగన్ పుట్టినరోజును ఘనంగా జరుపుకునేందుకు అభిమానులు ముందుగానే ఏర్పాట్లు చేసుకుంటూ, తమ అభిమానాన్ని ఫ్లెక్సీల రూపంలో చాటుకుంటున్నారు. జగన్ జన్మదినోత్సవం నేపథ్యంలో వైఎస్సార్‌సీపీ శ్రేణులు సేవా కార్యక్రమాలు, పేదలకు సహాయ కార్యక్రమాలు నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.






