- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గగన్ పహాడ్ ప్రాంతంలో భారీ అగ్ని ప్రమాదం
by samatah |
గగన్ పహాడ్ ప్రాంతంలో ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయలయ్యాయి. పేలుడు కారణంగా వెలువడిన శబ్దంతో

X
దిశ, తెలంగాణ క్రైమ్ బ్యూరో : గగన్ పహాడ్ ప్రాంతంలో ఓ స్క్రాప్ దుకాణంలో ఆదివారం ఉదయం పేలుడు సంభవించింది. ఈ ప్రమాదంలో పది మందికి గాయలయ్యాయి. పేలుడు కారణంగా వెలువడిన శబ్దంతో చుట్టుపక్కల వారు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. మహమ్మద్ బాబుద్ధిన్ అనే వ్యక్తి గగన్ పహాడ్ లో ఎస్ ఎస్ ఎంటర్ప్రైజెస్ పేర స్క్రాప్ దుకాణం నడుపుతున్నాడు. ఆదివారం ఉదయం ఉద్యోగులు పని చేస్తుండగా పేలుడు జరిగింది. దీంట్లో రాయల్, అస్లాం, సద్దాం, ఆఫ్తాబ్, కమల్, సాహిల్, ప్రతాప్ సింగ్, మామూ అనే ఉద్యోగులకు గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే వచ్చిన అగ్ని మాపక సిబ్బంది మంటలు ఆర్పారు. గాయపడ్డవారిని ఉస్మానియా ఆస్పత్రి కి తరలించారు. ఎయిర్ పోర్ట్ పోలీసులు షాప్ యజమాని పై కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పేలుడుకు కారణాలు వెల్లడి కావాల్సి ఉంది.
Next Story






