హైదరాబాద్‍లో భారీ పేలుడు

by Prasad Jukanti |   (  Updated:2026-02-20 09:59:03  IST  )

హైదరాబాద్ ఎల్పీనగర్ లోని చట్నీస్ రెస్టారెంట్ లో భారీ పేలుడు సంభవించింది. పేలుడు ధాటికి ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి.

హైదరాబాద్‍లో భారీ పేలుడు
X

దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‍లో భారీ పేలుడు సంభవించింది. ఇవాళ ఎల్బీనగర్ చట్నీస్ హోటల్‍లోఇడ్లీ స్టీమర్ ఒక్కసారిగా పేలిపోయింది. భారీ శబ్దంతో జరిగిన ఈ బ్లాస్టింగ్‍తో కస్టమర్లు భయాందోళనకు గురయ్యారు. హోటల్ నుంచి బయటకు పరుగులు తీశారు. ఈ ఘటనలో ముగ్గురు సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సహాయ చర్యలు చేపట్టారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.

Next Story