తెలంగాణ మహిళా పోలీసు విభాగానికి భారీ విరాళం

by Gantepaka Srikanth |

రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని 'మహిళా భద్రతా విభాగానికి' (ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌) తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు.

తెలంగాణ మహిళా పోలీసు విభాగానికి భారీ విరాళం
X

దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలోని మహిళల రక్షణ, భద్రత కోసం సేవలందిస్తున్న పోలీసు శాఖలోని 'మహిళా భద్రతా విభాగానికి' (ఉమెన్‌ సేఫ్టీ వింగ్‌) తార్నాక మహిళా సమాజం తరపున విజయలక్ష్మి రూ.50 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. ఈ మేరకు డీజీపీ శివధర్‌ రెడ్డిని కలిసి ఆమె విరాళానికి సంబంధించిన చెక్కును శుక్రవారం అందజేశారు. మహిళల భద్రత కోసం ప్రభుత్వం, పోలీసు యంత్రాంగం చేపడుతున్న కార్యక్రమాలకు తమ వంతు మద్దతుగా ఈ మొత్తాన్ని అందజేస్తున్నట్లు ఈ సందర్భంగా విజయలక్ష్మి పేర్కొన్నారు. సామాజిక బాధ్యతతో తార్నాక మహిళా సమాజం ముందుకు వచ్చి భారీ విరాళాన్ని అందించడం పట్ల డీజీపీ హర్షం వ్యక్తం చేశారు.

Next Story