- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
TG: గ్లోబల్ సమ్మిట్‌లో సంచలనం.. ఒక్క రోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు
TG: గ్లోబల్ సమ్మిట్‌లో సంచలనం.. ఒక్క రోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులు

దిశ, వెబ్‌డెస్క్: రంగారెడ్డి జిల్లా కందుకూరులోని ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్’ పేరిట రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గ్లోబల్ సమ్మిట్ (Telangana Rising Global Summit) సోమవారం అట్టహాసంగా ప్రారంభమైన విషయం తెలిసిందే. తాజాగా ఈ సమ్మిట్‌లో సంచలన పరిణామం చోటుచేసుకుంది. విద్యుత్ శాఖలో భారీ ఒప్పందాలు కుదిరాయి. ఇవాళ ఒక్కరోజే రూ.2 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందం జరిగింది. పంప్ స్టోరేజీ ప్రాజెక్టుల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఎంవోయూ జరిగింది.
కాగా, గ్లోబల్ సమ్మిట్ ప్రారంభ ప్లీనరీలో ప్రముఖ జాతీయ, అంతర్జాతీయ ప్రముఖులు పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, తెలంగాణ ఐటీ & పరిశ్రమల మంత్రి శ్రీ దుద్దిల్ల శ్రీధర్ బాబు, ట్రంప్ మీడియా & టెక్నాలజీ గ్రూప్ CEO ఎరిక్ స్వైడర్, నోబెల్ శాంతి గ్రహీత కైలాష్ సత్యార్థి, టీవీఎస్ సప్లై చైన్ చైర్మన్ ఆర్. దినేష్, అపోలో హాస్పిటల్స్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ శోభన కామినేని, అదానీ పోర్ట్స్ & SEZ మేనేజింగ్ డైరెక్టర్ కరణ్ అదానీ తదితరులు ప్రసంగించారు. నోబెల్ గ్రహీత అభిజిత్ బెనర్జీ, వరల్డ్ ఎకనామిక్ ఫోరం మేనేజింగ్ డైరెక్టర్ జెరెమీ జుర్గెన్స్ సమ్మిట్‌ను ఉద్దేశించి వర్చువల్‌గా ప్రసంగించారు.






