- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పంజాగుట్టలో యువకుల వీరంగం.. ఒక్కడిపై 20 మంది దాడి
పంజాగుట్ట మెట్రోస్టేషన్ వద్ద యువకులు వీరంగం సృష్టించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: పంజాగుట్ట మెట్రోస్టేషన్ వద్ద యువకులు వీరంగం సృష్టించారు. మెట్రోస్టేషన్ సమీపంలో ఉన్న ఓ షాపింగ్ మాల్ నుంచి బయటికి వస్తున్న యువకుడిపై 20 మంది దాడికి పాల్పడ్డారు. కార్లలో వచ్చిన 20మంది దుండగులు యువకుడిని విచాక్షణారహితంగా కొట్టారు. యువకుడిని రోడ్డు మీద పడేసి తన్నుతూ ఈడ్చుకుంటూ వెళ్లారు. ఈ ఘటనను గమనించిన స్థానికులు.. యువకుడిపై రౌడీ మూకలు చేస్తున్న దాడిని అడ్డుకున్నారు.
అందరూ ఒక్కసారిగా అరవడంతో గుర్తుతెలియని వ్యక్తులు కార్లలో పరారయ్యారు. వెంటనే స్థానికులు పంజాగుట్ట పోలీసులకు ఫోన్ చేసినా స్పందించలేదు. దీంతో ఇక చేసేదేం లేక అగంతకుల దాడిలో గాయపడిన బాధితుడిని ఆటోలో దగ్గరలోని ఆస్పత్రికి స్థానికులు తరలించి చికిత్స అందించారు. అయితే, 20 మంది యువకులు ఆ యువకుడిపై ఎందుకు దాడి చేశారు..? హత్య చేయడానికి వచ్చిన వ్యక్తులు ఎవరు? అనే విషయాలు తెలియరాలేదు. ఈ ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.






