- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తెలంగాణ బడ్జెట్‌లో ఓయూకు పెద్దపీట.. రూ. 1,000 కోట్లు కేటాయింపు
తెలంగాణ విద్యార్థి ఉద్యమాలకు గుండె కాయ ఉస్మానియా యూనివర్సిటీకి రాష్ట్ర బడ్జెట్‌లో పెద్ద పీట వేశారు. వర్సిటీ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించారు...

దిశ, వెబ్ డెస్క్: తెలంగాణ విద్యార్థి ఉద్యమాలకు గుండె కాయ ఉస్మానియా యూనివర్సిటీ(Osmania University)కి రాష్ట్ర బడ్జెట్(Budjet)లో పెద్ద పీట వేశారు. వర్సిటీ అభివృద్ధికి రూ. 1000 కోట్లు కేటాయించారు. ఈ మేరకు అసెంబ్లీ(Assembly)లో డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క(Batti Vikramarka) ప్రవేశపెట్టారు. ఓయూ కేంద్రంగా తెలంగాణ ఉద్యమం(Telangana Movement) ఉవ్వెత్తున ఎగిరిపడిన విషయం తెలిసిందే. అయితే గత ప్రభుత్వం పట్టించుకోలేదు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి(Cm Revanth Reddy) తొలి నుంచి కూడా ఓయూ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామని తెలిపారు. ఓయూకు సైతం ఆయన వెళ్లారు. విద్యార్థులతో భేటీ అయ్యారు. వారి సమస్యలను పరిష్కరించారు. నిరుద్యోగ సమస్యకు కూడా నోటిఫికేషన్ల ద్వారా పరిష్కరించారు. తాజాగా యూనివర్సిటీ అభివృద్ధిపై ఫోకస్ పెట్టిన ఆయన బడ్జెట్‌లో రూ. 1000 కోట్లు కేటాయిస్తామని చెప్పారు. ఈ మేరకు బడ్జెట్‌లో వర్సిటీకి కేటాయింపులు జరిపారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డి చెప్పినట్లు చేశారని పలువురు కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. ప్రపంచ స్థాయి విద్యా ప్రమాణాలకు అనుగుణంగా ఓయూని తీర్చిదిద్దే దిశగా ప్రభుత్వం పని చేస్తుందని తెలిపేందుకే భారీగా నిధులను మంజూరు చేసిందని చెబుతున్నారు.
వర్సిటీ అభివృద్ధికి రూ.1000 కోట్లు
కాగా బడ్జెట్‌లో కేటాయించిన రూ. 1,000 కోట్లను వర్సిటీలో మౌలిక సదుపాయాల కల్పన, పాత భవనాల పునరుద్ధరణ, నూతన హాస్టల్ భవనాల నిర్మాణానికి వినియోగించనున్నారు. ఈ కేటాయింపులతో యూనివర్సిటీలో అత్యాధునిక పరిశోధనా కేంద్రాలు (Research Labs), డిజిటల్ లైబ్రరీలు, స్మార్ట్ క్లాస్ రూమ్‌ల ఏర్పాటుకు మార్గం సుగమం అయింది. ఇక విద్యార్థులకు అవసరమైన క్రీడా ప్రాంగణాలు, క్యాంపస్ సుందరీకరణ పనులకు కూడా ఈ నిధులు వెచ్చించనున్నారు. ప్రభుత్వ తీసుకున్న ఈ నిర్ణయంపై విద్యార్ధులు, అధ్యాపకులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.






