- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, తెలంగాణ బ్యూరో: పన్నెండేళ్లకు ఒకసారి అత్యంత పవిత్రంగా జరుపుకునే గోదావరి పుష్కరాలకు కోసం ఈ బడ్జెట్‌లో ప్రభుత్వం భారీగా నిధులను కేటాయించింది. రాష్ట్రంలో 2027 జూన్ 26 నుండి జూలై 7 వరకు పుష్కరాలు జరగనున్నాయి. ఈ పవిత్ర దినాల్లో సుమారు 8 కోట్ల మంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారని ప్రభుత్వం అంచన వేస్తున్నది. ఈ నేపథ్యంలో తెలంగాణ సంస్కృతి ఉట్టిపడేలా కుంభమేళా తరహాలో ఈ పుష్కరాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్నది. ఈ పుష్కరాల నిర్వహణ, రోడ్ల విస్తరణ, కొత్త ఘాట్ల నిర్మాణం, దేవాలయాల అభివృద్ధి వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధి ఏర్పాట్లను పర్యవేక్షించడానికి మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో ఇప్పటికే ప్రత్యేక కేబినెట్ సబ్ కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. భక్తులకు సౌకర్యవంతమైన దర్శనం, భద్రత, రద్దీ నియంత్రణ కోసం ఆధునిక సాంకేతికతను వినియోగించే చర్యలు తీసుకుంటున్నది. ఈ గోదావరి పుష్కరాల నిర్వహణ కోసం ఈ బడ్జెట్‌లో రూ.500 కోట్లను ప్రతిపాదించారు.






