- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వెంకటాపూర్ ఫుడ్ పాయిజన్ ఘటనపై హెచ్‌ఆర్‌సీ సీరియస్.. సంగారెడ్డి కలెక్టర్‌కు నోటీసులు
పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది.

దిశ, డైనమిక్ బ్యూరో: పాఠశాల విద్యార్థులకు అందించే మధ్యాహ్న భోజనంలో తీవ్ర నిర్లక్ష్యం వహించడంపై తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ (TSHRC) ఆగ్రహం వ్యక్తం చేసింది. సంగారెడ్డి జిల్లాలో 22 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనను కమిషన్ సుమోటోగా (Suo-motu) విచారణకు స్వీకరించింది. ఈ ఘటనకు సంబంధించి దినపత్రికల్లో ‘వికటించిన మధ్యాహ్న భోజనం - 22 మంది విద్యార్థులకు అస్వస్థత’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై కమిషన్ జ్యుడిషియల్ సభ్యులు శివాది ప్రవీణ శుక్రవారం స్పందించారు.
సంగారెడ్డి జిల్లా, నారాయణఖేడ్ మండలం, వెంకటాపూర్ ప్రాథమిక పాఠశాలలో మధ్యాహ్న భోజనం తిన్న తర్వాత 22 మంది విద్యార్థులు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. అయితే, గ్రామంలో జరిగిన ఒక ప్రైవేట్ విందులో మిగిలిపోయిన ఆహార పదార్థాలను తీసుకొచ్చి, పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనంగా పెట్టడం వల్లే ఈ అనర్ధం జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తడం పట్ల కమిషన్ ఆందోళన వ్యక్తం చేసింది. తక్షణమే దీనిపై సమగ్ర విచారణ జరపాలని సంగారెడ్డి జిల్లా కలెక్టర్‌ను ఆదేశించింది. నివేదికను 2026 ఫిబ్రవరి 24 నాటికి కమిషన్‌కు సమర్పించాలని శివాది ప్రవీణ ఆదేశాలు జారీ చేశారు.






