కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతాడయ్యా..! కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు

by Kema Shiva Kumar |   (  Updated:2025-11-03 10:24:59  IST  )

రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని.. జూబ్లీహిల్స్‌కు పాకిస్తాన్‌తో లింక్ పెట్టడం ఏంటని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై ఫైర్ అయ్యారు.

కేసీఆర్ మళ్లీ సీఎం ఎలా అవుతాడయ్యా..! కిషన్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్‌డెస్క్: రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని.. జూబ్లీహిల్స్‌కు పాకిస్తాన్‌తో లింక్ పెట్టడం ఏంటని బీజేపీ సీనియర్ నేత, కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి (Kishan Reddy), సీఎం రేవంత్‌రెడ్డి (CM Revanth Reddy)పై ఫైర్ అయ్యారు. ఇవాళ జూబ్లీహిల్స్‌ ప్రచారంలో భాగంగా ఆయన మీడియాతో చిట్‌చాట్‌లో మాట్లాడుతూ.. మోసపు హామీలతో కాంగ్రెస్ (Congress) తెలంగాణలో అధికారంలోకి వచ్చిందని ఆరోపించారు. మహిళలకు ఫ్రీ బస్సు ప్రయాణం తప్ప చేసిందేమీ లేదని అన్నారు. ఆరు గ్యారంటీలు అటకెక్కాయని.. ఇచ్చిన హామీలు ఏ ఒక్కటీ అమలు చేయకుండా జూబ్లీహిల్స్‌లో తమ అభ్యర్థిని గెలిపించాలంటూ మంత్రులు ప్రచారం చేయడం సిగ్గుచేటని అన్నారు. రాజకీయ విమర్శలకు పరిమితులు ఉండాలని కామెంట్ చేశారు.

జూబ్లీహిల్స్‌లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే రేషన్ బియ్యం ఇవ్వడం ఆగిపోతుందని చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు. ఉప ఎన్నిక నేపథ్యంలో తాము ఎలాంటి సర్వేలు చేయలేదని, బీజేపీ అభ్యర్థి లంకల దిలీప్‌రెడ్డి (Dilip Reddy)కి అనూహ్య స్పందన వస్తుందని అన్నారు. ఇక అజరుద్దీన్‌ (Azharuddin)కు మంత్రి పదవి ఇవ్వడం రాజకీయంగా తమకు ప్లస్ పాయింటేనని అన్నారు. ఇక నగరంలో మెట్రో విస్తరణకు సంబంధించి ఇప్పటి వరకు రాష్ట్రం నుంచి ఎలాంటి ప్రతిపాదన రాలేదని అన్నారు. అదేవిధంగా ఎల్ అండ్ టీ (L&T) నుంచి ప్రభుత్వం టేకోవర్ చేసిన కొత్త డీపీఆర్‌ ఇంకా పంపలేదని తెలిపారు. రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్ష నేతలుగా ఉన్న కేసీఆర్ (KCR) రెండేళ్లుగా ఎక్కడా కనిపించడం లేదన్నారు. ప్రజల మధ్యకే రాని ఆయన మళ్లీ సీఎం ఎలా అవుతారని కిషన్‌రెడ్డి మీడియాతో చిట్‌చాట్‌లో కామెంట్ చేశారు.

READ MORE ...

సర్వేలను మేం పట్టించుకోం.. మా ధైర్యం దానిమీదే: కిషన్ రెడ్డి ధీమా

Next Story