ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్దికి ఎంత ఖర్చైనా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

by Malleboina Mahesh |

టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం జరిగింది. దీ

ఉస్మానియా యూనివర్సిటీ అభివృద్దికి ఎంత ఖర్చైనా ఇస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
X

దిశ, వెబ్ డెస్క్: టీపీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) అధ్యక్షతన గాంధీ భవన్‌లో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ (PCC) సమావేశం జరిగింది. దీనికి సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) తో పాటు ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan), ఏఐసీసీ కార్యదర్శులు విశ్వనాథన్, సచిన్ సావంత్, మంత్రులు, కొత్తగా ఎన్నికైన పార్టీ జిల్లా అధ్యక్షులు, పూర్వ అధ్యక్షులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఇటీవల జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షులుగా నియమితులైన వారికి సర్పంచ్ ఎన్నికలపై దిశా నిర్దేశం చేశారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. తర్వలో తెలంగాణ ప్రజా ప్రభుత్వం రెండేళ్ల పాలనను పూర్తి చేసుకోబొతున్నామని గుర్తు చేశారు. అలాగే డీసీసీ పదవి నేతలకు పార్టీ ఇచ్చిన గౌరవమని సీఎం చెప్పుకొచ్చారు. అలాగే తెలంగాణ ప్రభుత్వ పథకాలను ప్రతి ఇంటికి చేర్చాలని వారికి సూచించారు.

అలాగే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం బతుకమ్మ చీరలిస్తే ప్రజలు తిట్టుకున్నారు. కానీ నేడు ఇందిరమ్మ చీరలు మాకెందుకు ఇవ్వడంలేదని అడుగుతున్నారని, ప్రతి మహిళలకు చీర అందేలా చూడాల్సిన బాధ్యత డీసీసీలదే అన్నారు. అలాగే తెలంగాణలోని గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు చీరలిస్తున్నామని, కోటి మంది ఆడబిడ్డలను కోటీశ్వరులను చేయాలని చూస్తున్నామని సీఎం చెప్పుకొచ్చారు. అలాగే గత బీఆర్ఎస్ పాలన ఎలా ఉందో, నేటి ప్రజా పాలన ఎలా ఉందో చర్చ పెట్టాలని, తనకు 8 లక్షల కోట్ల అప్పుతో ప్రభుత్వాన్ని అప్పజెప్పారని, అయినా కూడా సంక్షోభం నుంచి సంక్షేమం వైపు రాష్ట్రాన్ని తాము తీసుకెళ్తున్నామని సీఎం అన్నారు. 2034 నాటికి వన్ ట్రిలియన్ డాలర్ల ఎకానమీగా మార్చడమే మన లక్ష్యమని డీసీసీలకు సీఎం స్పష్టం చేశారు.

అలాగే ఈ నెల 7న ఉస్మానియా యూనివర్సిటీకి వెళ్తామని, ఓయూ అభివృద్ధికి ఎంత ఖర్చైనా ఇస్తామని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. ఈ నెల 8, 9న ఫ్యూచర్ సిటీ లో గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తున్నామని, 9న తెలంగాణ-2047 పాలసీ డాక్యుమెంట్ ఆవిష్కరిస్తామని, రాష్ట్ర అభివృద్ధికి ప్రపంచ దిగ్గజ నేతల సలహాలు సూచనలు తీసుకున్నట్లు ఈ సందర్భంగా సీఎం తెలిపారు. కోర్ అర్బన్ ను క్యూర్ చేయాలని నిర్ణయించామని, కాలుష్యకారక పరిశ్రమలను ఓఆర్ఆర్ బయటకు తరలిస్తున్నామని, మూసీ ప్రక్షాళన, మెట్రో విస్తరణ, ఇండస్ట్రీస్ తరలింపు ప్రధాన లక్ష్యాలుగా పెట్టుకొని ముందుకు సాగుతున్నామని ఈ సందర్భంగా గాంధీ భవన్ లో సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) చెప్పుకొచ్చారు.

Next Story