- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పోలీస్ ఎలా అయ్యారు..? భగీరథ్ కేసుపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్‌కు వీరేశం స్ట్రాంగ్ కౌంటర్
బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్, వేముల వీరేశం కౌంటర్ ఇచ్చారు.

దిశ, తెలంగాణ బ్యూరో : బీఆర్ఎస్ నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ చేసిన కామెంట్లకు ప్రభుత్వ విప్, వేముల వీరేశం కౌంటర్ ఇచ్చారు. గురువారం సీఎల్పీలోని మీడియా సెంటర్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బండి భగీరథ్ కేసులో ఎఫ్ఐఆర్ అయిన తర్వాతే బీఆర్ఎస్ ఈ అంశంపైన మాట్లాడిందని, ఈ అంశాన్ని తామే వెలికి తీశామన్నట్లుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్నారని వేముల వీరేశం మండిపడ్డారు. ప్రవీణ్ కుమార్ మాట్లాడుతున్న భాష దారుణంగా ఉందని, ఫోక్సో కేసులో ఎక్కడైనా స్టేషన్ బెయిల్ ఇస్తారా? అని ఆయన ప్రశ్నించారు. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి అయిన బండి సంజయ్ ఇంటిని మా పోలీసులు సోదా చేశారని, బండి సంజయ్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు చేశారన్నారు. పారదర్శకంగా సీఎం పనిచేస్తుంటే విమర్శలు చేస్తున్నారని, ఎఫ్ఐఆర్ అయిన తర్వాత కూడా సెక్షన్లు మార్చి కేసును మరింత బలోపేతం చేశారని వేముల వీరేశం చెప్పారు.
కేసీఆర్, కేటీఆర్ భరతం పడతా, దొర గడీలు బద్దలు కొట్టి ఏనుగును తీసుకుపోతానని గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ చెప్పారని, దొర గడీల్లో ఏనుగును తాకట్టుపెట్టింది, బానిసలా ఉంది ఆర్ఎస్ ప్రవీణ్ కుమారే..దొర గడీలు బద్దలు కొట్టింది మా రేవంత్ రెడ్డి అని వేముల వీరేశం అన్నారు. ఫోన్ ట్యాపింగ్ చేశారని గతంలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గగ్గోలు పెట్టారని, ఫోన్ ట్యాపింగ్ చేశారని ఫిర్యాదు చేసిన ఆయనే దొర గడీకి పోయిన తర్వాత ప్రభాకర్ రావు చాలా మంచోడని స్టేట్ మెంట్ ఇచ్చారని ఆరోపించారు. ప్రభాకర్ రావు మంచోడు అని చెప్పడం అంటే ఎంతకు దిగజారిపోయాడో అర్థమౌతోందని, ఫామ్ హౌస్ కు సెక్యూరిటీ ఇచ్చే పోలీస్ గా, కేసీఆర్ దుర్మార్గాలను కాపాడే సెక్యూటీరిగా ప్రవీణ్ కుమార్ మారారని, మాజీ ఐపీఎస్ అధికారి అయిన ఆయన ఊడిగం చేసినట్లుగా వ్యవహారిస్తున్నారని వేముల వీరేశం విమర్శించారు.
తెలంగాణ పోలీసుల మనోభావాలను దెబ్బతీస్తున్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఎలా పోలీస్ అయ్యారని, దేశంలోనే తెలంగాణ పోలీస్ రోల్ మోడల్, రాష్ట్రాన్ని మావోయిస్టు రహిత రాష్ట్రంగా తెలంగాణ పోలీసులు మార్చారని ఆయన చెప్పారు. భగీరథ్ ను అరెస్ట్ చేసి పోలీసులు తీసుకువచ్చిన వీడియోలు ఉన్నాయని, పోలీసులు చెప్పేది నమ్మకుండా రాజకీయ నాయకులు చెప్పే విషయాలను నమ్మే దీన స్థితిలో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉన్నారని వేముల వీరేశం విమర్శలు గుప్పించారు. బీజేపీ పైన మాట్లాడకుండా రేవంత్ రెడ్డి పైన విమర్శలు చేస్తున్నారని, బీజేపీ, బీఆర్ఎస్ కు ఉన్న అండర్ స్టాండింగ్ ఏమిటీ..? అని నిలదీశారు. తెలంగాణ సమాజానికి ప్రవీణ్ కుమార్ తప్పుడు సమాచారాన్ని ఇస్తున్నారని మేముల వీరేశం మండిపడ్డారు.






