- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చెప్పినట్టు వినకపోతే అంతే.. సచివాలయంలో హౌస్ కీపింగ్, స్వీపర్లకు వేధింపులు
సచివాలయంలో హౌస్ కీపింగ్, స్వీపర్లకు వేధింపులు కలకలం రేపుతున్నాయి.

X
దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాష్ట్ర సచివాలయం హౌస్ కీపింగ్ వర్కర్స్, స్వీపర్స్ ఆందోళనకు దిగారు. సూపర్ వైజర్లు కొంత కాలంగా తమను కులం పేరుతో దూషించడమే కాకుండా మహిళలు అని కూడా చూడకుండా బండ బూతులు తిడుతూ పని చేయిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చెప్పినట్టుగా వినకపోతే జాబ్ నుంచి తొలగిస్తామని భయాందోళనకు గురి చేస్తున్నారని, సూపర్ వైజర్లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం నిరసనకు దిగారు. సిబ్బంది ఆందోళనతో ఉదయం నుంచి కాంట్రాక్టర్ ను సంప్రదించేందుకు ఉన్నతాధికారుల ప్రయత్నించినా కేవీఆర్ యాజమాన్యం అందుబాటులోకి రాలేదని తెలుస్తున్నది. సిబ్బంది ఆందోళనకు సంబంధించిన పలు వీడియోలు సోషల్ మీడియాలు ప్రస్తుతం చక్కర్లు కొడుతున్నాయి. అయితే ఈ ఆందోళనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






