- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గ్యాస్ కొరత పేరుతో దోపిడీ.. ఒక్క ప్లెయిన్ దోశకు రూ.109
సాధారణంగా హోటల్‌కు వెళ్తే మనం తిన్న ఆహార పదార్థాల ధరతో పాటు జీఎస్టీ (GST) లేదా సర్వీస్ ఛార్జీలు పడటం చూస్తుంటాం.

దిశ, వెబ్‌డెస్క్: సాధారణంగా హోటల్‌కు వెళ్తే మనం తిన్న ఆహార పదార్థాల ధరతో పాటు జీఎస్టీ (GST) లేదా సర్వీస్ ఛార్జీలు పడటం చూస్తుంటాం. కానీ, ప్రస్తుతం దేశవ్యాప్తంగా నెలకొన్న ఎల్పీజీ (LPG) కొరత కారణంగా రెస్టారెంట్లు వినూత్నంగా 'గ్యాస్ క్రైసిస్ ఛార్జ్' (Gas Crisis Charge) వసూలు చేయడం మొదలుపెట్టాయి. తాజాగా హైదరాబాద్‌లోని గచ్చిబౌలిలో వెలుగుచూసిన ఒక బిల్లు ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడ (గచ్చిబౌలి) ప్రాంతంలోని ఒక హోటల్‌లో ఒక కస్టమర్ ప్లెయిన్ దోశ ఆర్డర్ చేశారు. ఆ దోశ ధర రూ.79. అయితే, బిల్లు చేతికి రాగానే అందులో 'గ్యాస్ ఛార్జ్' కింద అదనంగా రూ.30 కలిపారు. దీంతో కేవలం రూ.79 కావాల్సిన బిల్లు కాస్తా రూ.109కి చేరింది. దీనికి సంబంధించిన ఫోటోను సదరు కస్టమర్ 'X' (గతంలో ట్విట్టర్) వేదికగా పంచుకోవడంతో అది కాస్తా వైరల్‌గా మారింది. ఇలాంటి వింత ఛార్జీలు కేవలం హైదరాబాద్‌కే పరిమితం కాలేదు. బెంగళూరు థియో కేఫ్ అనే రెస్టారెంట్‌లో లెమనేడ్ ఆర్డర్ చేసిన కస్టమర్‌కు బిల్లుపై 5 శాతం 'గ్యాస్ క్రైసిస్ ఛార్జ్' వేశారు. ఢిల్లీ, ముంబై: ఈ నగరాల్లోని పలు ఫుడ్ అవుట్‌లెట్లలో కూడా ఇలాంటి అదనపు వసూళ్లు జరుగుతున్నట్లు నివేదికలు అందుతున్నాయి.






