- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Hot News: కాసుల గలగల.. ఆ ఎమ్మెల్యే వన్ డే ప్రాఫిట్ @ రూ.20 లక్షలు
ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారి ఆదాయం సుమారు రూ. 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమీ సమకూరడం లేదు.

దిశ, తెలంగాణ బ్యూరో: ఉత్తర తెలంగాణకు చెందిన ఓ ఎమ్మెల్యే రోజువారి ఆదాయం సుమారు రూ. 20 లక్షలు. ఆయనకు ఎటువంటి వ్యాపారాల నుంచి పెద్దగా ఆదాయం ఏమీ సమకూరడం లేదు. కానీ, ఇండస్రీయల్ వెస్టేజ్ ద్వారా పెద్ద మొత్తంలో లాభాలు సమకూరుతున్నట్లు విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఆ ఎమ్మెల్యేకు వెస్టేజ్ తరలించే బిజినెస్ కూడా లేదని తెలిసింది. అయితే, ఆ ఇండస్ట్రియల్ వెస్టేజ్‌ను ఇతర ప్రాంతాలకు సరఫరా చేసే ట్రాన్స్‌పోర్టు వెహికల్స్‌కు ‘స్పెషల్ ట్యాక్స్’ విధించడం వల్లే సమకూరుతోందని ఆరోపణలు వస్తున్నాయి. ఆయనకు ట్యాక్స్ చెల్లించాకే ఆ ప్రాంతం నుంచి వెహికల్స్ బయటికి వెళ్లేందుకు లీడర్లు పర్మిషన్స్ ఇస్తారనే చర్చ స్థానికంగా జరుగుతున్నది. ఎవరైనా నిర్దేశించిన ట్యాక్స్ చెల్లించకపోతే ఆ వెహికల్ అక్కడ నుంచి బయటికు వెళ్లనివ్వరని టాక్. ఈ తతంగం మొత్తం సదరు ఎమ్మెల్యే అనుచరులు, స్థానికంగా ఉన్న పోలీసులు, ట్రాన్స్‌పోర్టు సిబ్బంది సహకరిస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా దీనిపై నిఘా పెట్టిన ఇంటెలిజెన్స్ అధికారులు ప్రభుత్వానికి రిపోర్టు ఇచ్చినట్లు తెలుస్తోంది.
సగం ఎమ్మెల్యేకు, మిగతా సగం పంపకాలకు?
నిత్యం వసూలు చేసే స్పెషల్ ట్యాక్స్‌లో ఎమ్మెల్యే న్యాయబద్ధంగా అన్ని పార్టీల రాజకీయ నేతలకు వాటాలు ఇస్తున్నారని ప్రచారం ఉంది. అలాగే, ఆ ప్రాంతంలోని రెవెన్యూ, పోలీసు, ట్రాన్స్‌పోర్టు, స్థానికంగా పలుకుబడి ఉన్న వ్యక్తుల హోదాల మేరకు నగదును పంపించే ఏర్పాట్లు చేసినట్లు తెలుస్తోంది. అందుకే ఆ ప్రాంతంలో పార్టీల మధ్య విమర్శలు, ఆరోపణలు లేకుండా అంతా సాఫీగా జరిగిపోతుందని వినికిడి. ఆ దందాలో అందరికీ భాగస్వామ్యం ఉండటంతో ప్రశ్నించవారే కరువయ్యారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.






