- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Hot News: కవిత వేరు కుంపటి..? కోడైకూస్తున్న సోషల్ మీడియా
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగానే అడుగులు పడుతున్నాయా?

దిశ, తెలంగాణ బ్యూరో: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సొంత పార్టీ ఏర్పాటు దిశగానే అడుగులు పడుతున్నాయా..? తెలంగాణ జాగృతి అనుబంధ సంఘాలను వరుసగా ప్రకటించడం వెనకాలా జాగృతిని బలోపేతం చేయడం ద్వారా తన సత్తాను చాటాలని చూస్తున్నారా..? పార్టీకి సమాంతరంగా జాగృతిని బలోపేతం చేస్తున్నారా అంటే అవుననే సమాధానం వస్తుంది. పార్టీ రజతోత్సవ సభ జరిగిన తరువాత తండ్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్కు లేఖ రాసిన కవిత, ఆమెరికాకు వెళ్లే ముందు జాగృతి అనుబంధ సంఘాలను ప్రకటించారు. జాగృతికి సంబంధించి మరికొన్ని కమిటీలను కూడా ప్రకటించాలని ఆమె నిర్ణయించారు. దీనిలో భాగంగా తెలంగాణలో తీవ్ర ప్రభావాన్ని చూపే 50వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా ఉపాధి కల్పిస్తున్న సింగరేణి సంఘాన్ని ప్రకటించారు.
11 ప్రాంతాల బాధ్యులను ప్రకటించారు. త్వరలో మరికొన్ని సంఘాలకు బాధ్యులను ప్రకటించనున్నారు. ఇందుకు కసరత్తు చేస్తున్నారు. జాగృతిని బలోపేతం చేసే దిశగా ఆమె చేస్తున్న ప్రయత్నాలు ఆమె కొత్త రాజకీయ పార్టీకి అంకురార్పణ చేయనున్నారని సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం జరుగుతోంది. పార్టీ పేరు కూడా ఖరారు అయిందని ప్రచారం చేస్తున్నారు. కాగా, కేసీఆర్ పంపిన దూతలతో బుజ్జగింపులు విఫలమయ్యాయని సమాచారం. మలి దశ చర్చలు, బుజ్జగింపులు త్వరలోనే ఉంటాయని సమాచారం. ఇలా కవిత రాజకీయ వ్యవహరాలు హాట్ టాపిక్గా మారాయి. చివరికి ఈ పరిస్థితులు ఎక్కడికి దారితీస్తాయోనన్న చర్చ జరుగుతోంది.






