TG: ఘోర రోడ్డు ప్రమాదం.. స్పాట్‍లో ముగ్గురు మృతి

by Prasad Jukanti |   (  Updated:2026-03-15 11:01:54  IST  )

నల్గొండ జిల్లా చింతపల్లి మండలం దేవతపల్లి గేట్ వద్ద ఆటో, లారీ ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు.

TG: ఘోర రోడ్డు ప్రమాదం..  స్పాట్‍లో ముగ్గురు మృతి
X

దిశ, నాంపల్లి/ డైనమిక్ బ్యూరో: నల్గొండ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Nalgonda Road Accident) జరింది. నాంపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో ఆదివారం మధ్యాహ్నం ఇటుకల లోడుతో వెళ్తున్న లారీ ప్యాసింజర్ ఆటోను ఢీ కొట్టింది. ఈ ఘటనలో ముగ్గురు ప్రయాణికులు స్పాట్ లోనే ప్రాణాలు కాల్పోగా మరో ఎనిమిది మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నాంపల్లి మండలం రేఖ్య తండా గ్రామ పంచాయతీలో వస్త్రం తండా వద్ద ఇటుక లోడుతో వెళ్తున్న లారీ మల్లె పెళ్లికి ప్యాసింజర్‍తో వెళ్తున్న ఆటోను ఎదురుగా ఢీకొంది. ఈ ఘటనలోని క్షతగాత్రులను దేవరకొండ ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

Next Story