- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
Breaking: హైదరాబాద్ బేగంపేట్లో భీభత్స రోడ్డు ప్రమాదం.. నుజ్జు నుజ్జు అయిన థార్, బోల్తా పడ్డ ట్రక్
by Ramesh Naini |
హైదరాబాద్‌లోని బేగంపేట్ బస్ స్టాప్ సమీపంలో ఇవాళ (మంగళవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది.

X
దిశ, డైనమిక్ బ్యూరో: హైదరాబాద్‌లోని బేగంపేట్ బస్ స్టాప్ సమీపంలో ఇవాళ (మంగళవారం) ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల సమాచారం ప్రకారం.. ఔటర్ రింగ్ వైపు నుంచి వస్తున్న హెవీ లోడ్ ట్రక్, ముందుగా వెళ్తున్న మహీంద్రా థార్ వాహనాన్ని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ మేరకు థార్ వెనుక భాగం పూర్తిగా నుజ్జునుజ్జు అయ్యింది. ప్రభావం తీవ్రంగా ఉండటంతో హెవీ లోడ్ ట్రక్ అక్కడికక్కడే బోల్తా పడింది.
సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ట్రాఫిక్‌ను నియంత్రించారు. గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాద సమయంలో థార్ వాహనంలో ఎంతమంది ఉన్నారనే వివరాలు ఇంకా బయటకు రాలేదు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.
Next Story






