Bandi Sanjayకి హోంమంత్రి Amit Shah ఫోన్.. అరెస్ట్‌పై ఆరా

by Satheesh |   (  Updated:2022-08-23 08:46:49  IST  )

టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను జనగాంలో పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించిన విషయం తెలిసిందే.

Bandi Sanjayకి హోంమంత్రి Amit Shah ఫోన్.. అరెస్ట్‌పై ఆరా
X

దిశ, వెబ్‌డెస్క్: టీ-బీజేపీ చీఫ్ బండి సంజయ్‌ను జనగాంలో పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించిన విషయం తెలిసిందే. దీంతో బండికి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఫోన్ చేశారు. పాదయాత్రలో పోలీసులు అరెస్ట్ చేయడంపై ఆయన ఆరా తీశారు. అయితే, హైదరాబాద్‌లో బీజేపీ కార్యకర్తలపై దాడికి నిరసనగా రాష్ట్రవ్యాప్త ఆందోళనలకు బండి సంజయ్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా జనగాంలో దీక్షకు సిద్ధమవుతున్న బండి సంజయ్‌ను పోలీసులు అరెస్ట్ చేసి కరీంనగర్‌కు తరలించారు. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా బీజేపీ శ్రేణులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు.

Next Story