సర్పంచ్ ఎన్నికలు... రేపు స్కూళ్లకు హాలిడే

by Muthe.Rajitha |

రేపు తెలంగాణలో మొదటి విడత పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది.

సర్పంచ్ ఎన్నికలు... రేపు స్కూళ్లకు హాలిడే
X

దిశ, వెబ్ డెస్క్ : రేపు తెలంగాణలో మొదటి విడత పంచాయితీ ఎన్నికలకు సర్వం సిద్ధం అయింది. మొదటి విడతలో 4,236 గ్రామాల్లో సర్పంచ్, వార్డు సభ్యులను ఎన్నుకోనున్నారు. దీంతో పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేసిన పాఠశాలలకు విద్యాశాఖ అధికారులు రేపు సెలవు ప్రకటించారు. అయితే ఆయా స్కూళ్లకు ఈరోజు కూడా హాలిడే ఇచ్చారు. ఇక ఆ తర్వాత జరిగే 2 విడతల పోలింగ్ నేపథ్యంలో ఈనెల 13,14.. 16, 17 తేదీల్లో పోలింగ్ జరిగే స్కూళ్లకు సెలవులు ఉండనున్నాయి. తొలి విడత పోలింగ్ కేంద్రాల్లో రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంటకు పోలింగ్ ముగుస్తుండగా.. అనంతరం ఫలితాల లెక్కింపు ఉంటుంది.

Next Story