గుడ్ న్యూస్... రేపు ఆ ఉద్యోగులకు హాలిడే

by velandi.Saikiran |

GHMCలో పని చేసే ఉద్యోగులకు (employees ) రేపు సెలవు ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్

గుడ్ న్యూస్... రేపు ఆ ఉద్యోగులకు హాలిడే
X

దిశ, వెబ్ డెస్క్ : GHMCలో పని చేసే ఉద్యోగులకు (employees ) రేపు సెలవు ఉండనుంది. ఈ మేరకు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్ ( Hyderabad Local Body Election Returning Officer) ప్రకటన చేశారు. ఎలక్షన్ కోసం అని ఏర్పాట్లు పూర్తి చేయడం జరిగిందని... దాదాపుగా 500 మంది ఎలక్షన్ డ్యూటీ లో పాల్గొంటారన్నారు. రెండు పోలింగ్ కేంద్రాలు GHMC హెడ్ ఆఫీస్ లో ఏర్పాటు చేశామని తెలిపారు. పోలింగ్ సిబ్బందికి ట్రైనింగ్ ఇప్పటికే ఇచ్చాం..సింగిల్ టేబుల్ లో కౌంటింగ్ జరుగుతుందన్నారు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్.

మొత్తం 112 ఓటర్లు ఉన్నారు.. ప్రిఫరేషియల్ పద్దతి ( Preferential voting) ప్రకారం ఓటింగ్ జరుగుతుందని వెల్లడించారు. రేపు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ జరుగుతుందన్నారు. 200 నుంచి 250 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. ఒకే మతంకు ఓటు వేయాలని కోరిన వారిపై చర్యల కోసం ఎలక్షన్ కమిషనర్ తో పాటు పోలీసులకు ఫిర్యాదు చేశామని స్పష్ఠం చేశారు హైదరాబాద్ లోకల్ బాడీ ఎలక్షన్ రిటర్నింగ్ ఆఫీసర్. అటు రేపు హైదరాబాద్ లో వైన్స్ మూతపడతాయి. మొన్నటి నుంచి క్లోజ్ గానే ఉన్నాయి.

Next Story