- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Breaking: రేపు విద్యాసంస్థలకు సెలవు
విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త వచ్చింది.

దిశ,వెబ్‌డెస్క్: విద్యార్థులకు ఎగిరి గంతేసే శుభవార్త వచ్చింది. పాఠశాలలకు నిన్న(రెండో శనివారం), నేడు(ఆదివారం) సెలవులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ రెండు రోజులు సంతోషంగా ఎంజాయ్ చేస్తున్న విద్యార్థులకు మరో గుడ్ న్యూస్ వచ్చింది. రేపు(సోమవారం) విద్యాసంస్థలకు ప్రభుత్వం సెలవు ప్రకటించింది. రేపు(ఏప్రిల్ 14) భారత రాజ్యాంగ నిర్మాత డా.బీఆర్ అంబేద్కర్ జయంతి ఉంది.
ఈ సందర్భంగా రేపు జాతీయ సెలవు దినంగా కేంద్ర ప్రభుత్వం తాజాగా ప్రకటించింది. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాల్లోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. 14న పబ్లిక్ హాలిడే గా పేర్కొంటూ ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh), తెలంగాణ(Telangana) విద్యాశాఖలు క్యాలెండర్‌లో పొందుపర్చాయి. ఇప్పటికే ఆదివారం హాలిడే రావడంతో సోమవారం కూడా విద్యార్థులకు కలిసొచ్చింది. అటు దేశవ్యాప్తంగా బ్యాంకులతో పాటు స్టాకు మార్కెట్లకు కూడా రేపు సెలవు(Holiday) ఉండనుంది. ఆ తర్వాత మళ్లీ ఈ నెల(ఏప్రిల్) 18వ తేదీన గుడ్ ఫ్రైడే సందర్భంగా స్కూళ్లకు సెలవు ఉండనుంది.






