TG: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన

by Gantepaka Srikanth |   (  Updated:2025-08-28 03:13:00  IST  )

తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) దంచికొడుతున్నాయి.

TG: భారీ వర్షాలు.. స్కూళ్లకు సెలవు ప్రకటన
X

దిశ, వెబ్‌డెస్క్: తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు(Heavy Rains) దంచికొడుతున్నాయి. భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. వరదల ధాటికి పలువురు గల్లంతయ్యారు. వివిధ జిల్లాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. వర్షాల వేళ అధికార యంత్రాంగం అప్రమత్తం అయింది. మరో 6 జిల్లాల్లో స్కూళ్ల(Telangana Schools)కు సెలవులు ప్రకటించారు. నల్గొండ, యాదాద్రి, కరీంనగర్, సిద్దిపేట, జగిత్యాల, సిరిసిల్ల జిల్లాల్లో హాలిడే(School Holiday) ఇచ్చారు. ఇప్పటికే కామారెడ్డి, మెదక్, నిర్మల్, ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల్లో విద్యాసంస్థలకు సెలవు ఇస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా ఇవాళ రాష్ట్రంలో భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురుస్తాయని IMD హెచ్చరించింది.

Next Story