- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
HMWSSB: స్పెషల్ డ్రైవ్ సక్సెస్.. 3,185 కి.మీ పైపులైన్ పనులు ఫినీష్
సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ- హైదరాబాద్, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజులు స్పెషల్ డ్రైవ్ రెండో విడత విజయవంతంగా పూర్తయింది.

దిశ, తెలంగాణ బ్యూరో: సీవరేజీ ఓవర్ ఫ్లో ఫ్రీ సిటీ- హైదరాబాద్, ఇంకుడు గుంతల నిర్మాణమే లక్ష్యంగా జలమండలి చేపట్టిన 90 రోజులు స్పెషల్ డ్రైవ్ రెండో విడత విజయవంతంగా పూర్తయింది. ఈ స్పెషల్ డ్రైవ్ డిసెంబర్ 31న పూర్తి కావడం.. విజయవంతం కావడంతో సీఎం రేవంత్ రెడ్డి జలమండలి అధికారులు, సిబ్బందిని అభినందించి, ఈ డ్రైవ్‌ను మరో 90 రోజులు పొడిగించాలని ఆదేశించారు. అక్టోబర్ 2 నుంచి మార్చి 30 నాటికి 180 రోజులు డీ సిల్టింగ్ పనులు చేపట్టారు. ఫలితంగా ఇప్పటి వరకు ఈ డ్రైవ్ ద్వారా 24,146 ప్రాంతాల్లో 3,185 కిలో మీటర్ల సీవరేజీ పైపులైన్, 2.50 లక్షల మ్యాన్ హోళ్లలో డీ-సిల్టింగ్ పనులు పూర్తి చేశారు. ఈ స్పెషల్ డ్రైవ్ ఫలితంగా రోజూ వచ్చే సీవరేజీ ఫిర్యాదులు 20 నుంచి 30 శాతానికి తగ్గాయి. ఈ సందర్బంగా ఎండీ అశోక్ రెడ్డి మాట్లాడుతూ.. సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో ఈ స్పెషల్ డ్రైవ్‌ను ప్రారంభించామన్నారు. ఈ స్పెషల్ డ్రైవ్ విజయవంతం కావడంలో జలమండలి అధికారులు, సిబ్బంది కృషి ఎంతో ఉందని కొనియాడారు. అందరి సమష్టి కష్టం వల్లే ఇది సాధ్యమైందన్నారు. రాబోయే రోజుల్లో ఇంతకు మించి సామర్థ్యంతో కష్టపడతామని చెప్పారు. ఇదే స్ఫూర్తితో జూన్ నాటికి మిగతా మాన్ హోల్‌ళ్లు కూడా డీ సిల్టింగ్ పూర్తి చేయాలని సూచించారు.
రోజువారీ పర్యవేక్షణకు డాష్ బోర్డ్..
స్పెషల్ డ్రైవ్ పనులను రోజూవారీగా పర్యవేక్షించేందుకు ప్రత్యేక డాష్ బోర్డ్ ఏర్పాటు చేశారు. సీవరేజీ ఓవర్ ఫ్లో, కలుషిత నీరు, రోడ్లపై సిల్ట్ తదితర వాటిపై ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను ఆయా క్యాన్ నంబర్లను జీపీఎస్ ఆధారంగా గూగుల్ మ్యాప్‌లో నమోదు చేశారు. ఈ నమోదు ఒక్కో ప్రాంతంలో ఎన్నిసార్లు ఫిర్యాదులు అందినవి, ఎన్నిసార్లు పరిష్కరించారనే వివరాలను ఆ మ్యాప్‌లో ఒక బబుల్ (బుడగ)లా కనిపించేలాగా ఏర్పాటు చేశారు. వచ్చిన ఫిర్యాదుల సంఖ్యను బట్టి ఆ బబుల్ పరిమాణం మారేలా ఏర్పాటు చేశారు. దీని వల్ల సమస్య తీవ్రతను బట్టి దాన్ని పరిష్కరించారు. అలాగే ఈ డాష్ బోర్డును ఇప్పటి వరకు శుభ్రం చేసిన పైపు లైన్ల పొడవు, మ్యాన్ హోళ్ల సంఖ్య వివరాలు ఫొటోలతో సహా అప్ లోడ్ చేసేలా రూపకల్పన చేశారు. సిల్ట్ కార్టింగ్ వాహనాలు తిరిగే ప్రాంతాలు జీపీఎస్ సహకారంతో తెలుసుకునే వెసులుబాటు కల్పించామని చెప్పారు. ఎక్కడైనా కొత్త పైపులైన్ల నిర్మాణ ప్రతిపాదనను సైతం నమోదు చేసేలా రూపొందించినట్లు పేర్కొన్నారు. అన్ని రకాల రిపోర్టులను తయారు చేసి, వాటిని విశ్లేషించుకునే సౌకర్యం సైతం కల్పించారు.
మూడేళ్ల ఫిర్యాదుల విశ్లేషణ..
ఈ స్పెషల్ డ్రైవ్ పకడ్బందీగా అమలు చేసేందుకు గత మూడేళ్లలో వచ్చిన సీవరేజీ ఫిర్యాదులను విశ్లేషించారు. ప్రధానంగా వినియోగదారుల ఇళ్లల్లో లీకేజీ, రోడ్లపై సీవరేజీ ఓవర్ ఫ్లో సమస్యలను గుర్తించారు. రోజూ వచ్చే ఫిర్యాదుల్లో 60 శాతం ఇవే రావడంతో వాటిపై దృష్టిసారించి పరిష్కరించారు. గతేడాది అక్టోబర్ నుంచి మార్చి 2025 వరకు ఎంసీసీకి వచ్చే ఫిర్యాదులను పరిశీలిస్తే తగ్గుతూ వచ్చాయి.
ఏడాది - నెల - తగ్గిన ఫిర్యాదుల శాతం
2024 - అక్టోబర్ - 3.8
2024 - నవంబర్ - 21.4
2024 - డిసెంబర్ - 25.6
2025 - జనవరి - 25.7
2025 - ఫిబ్రవరి - 27.7
2025 - మార్చి - 19.6






